Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ వెళ్లిపోవలసిన సమయం వస్తే తనే తప్పుకుంటాడు.. చిన్ననాటి కోచ్ సమర్థన

జట్టుకు భారమైన క్షణంలో టీమిండియా నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకుంటాడని, ఆ విషయంలో ఒకరు చెప్పేంతవరకు అలాగే ఉండిపోడని థోనీ చిన్ననాటి కోచ్ చంచల్ భట్టాచార్య పేర్కొన్నారు. 2019 ప్రపంచకప్ ఆడే ఫిటెనెస్ ప్రస

ధోనీ వెళ్లిపోవలసిన సమయం వస్తే తనే తప్పుకుంటాడు.. చిన్ననాటి కోచ్ సమర్థన
హైదరాబాద్ , శనివారం, 8 జులై 2017 (03:43 IST)
జట్టుకు భారమైన క్షణంలో టీమిండియా నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకుంటాడని, ఆ విషయంలో ఒకరు చెప్పేంతవరకు అలాగే ఉండిపోడని థోనీ చిన్ననాటి కోచ్ చంచల్ భట్టాచార్య పేర్కొన్నారు. 2019 ప్రపంచకప్ ఆడే ఫిటెనెస్ ప్రస్తుతం ధోనీలో పుష్కలంగా ఉందని, ఇప్పటికీ అతడు మ్యాచ్ బెస్ట్ ఫినిషర్‌గానే ఉన్నాడని చెప్పారు. ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం తగ్గని ధోనీని అవమానించేలా వ్యాఖ్యలు చేయవద్దని ఒక  మ్యాచ్‌లో విఫలమైనంతమాత్రాన్ అతడి పని అయిపోయిందనే ప్రచారాలు చేయవద్దని సూచించారు. 
 
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2019 ప్రపంచకప్ వరకు జట్టుతో కొనసాగుతాడని అతని చిన్ననాటి కోచ్ చంచల్ భట్యాచార్య ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటున్న ధోనీకి శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ధోనీలో ఫిటెనెస్ ఏమాత్రం తగ్గలేదని మరో మెగా టోర్నీ ఆడే సత్తా అతనికి ఉందని వివరించారు. 
 
ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన నాలుగో వన్డేలో 16 ఏళ్ల తర్వాత భారత్ తరఫున ధోనీ అతి నెమ్మది అర్ధశతకం నమోదు చేయడంపై కూడా కోచ్ స్పందించారు. ‘ప్రతి రోజు ఆదివారం కాదు. అలానే.. ధోనీకి ఆ రోజు కలిసి రాలేదు. నిజానికి అది అతని స్థాయి ఇన్నింగ్స్ కానేకాదు. ఆ మ్యాచ్‌లో కొన్ని తప్పిదాలు చేశాడు. ధోనీ ఎప్పుడూ భారత్‌ని గెలిపించేందుకే ఆడతాడు. అతను కచ్చితంగా మళ్లీ బెస్ట్ ఫినిషర్‌‌గా నిరూపించుకుంటాడు. 2019 ప్రపంచకప్ ఆడే ఫిటెనెస్ ప్రస్తుతం ధోనీలో పుష్కలంగా ఉంది. జట్టుకి భారంగా మారానని అతను భావిస్తే.. పక్కకి వెళ్లిపోమని అతనికి ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. టెస్టులకి రిటైర్మెంట్, కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం తరహాలోనే ఎవరికీ చెప్పకుండానే అతను భారత్ జట్టుని వదిలేస్తాడు’ అని భట్టాచార్య వివరించాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ రికార్డుకు చేరువవుతున్నా గుర్తింపుకు ఆమడదూరంలో మిథాలీ రాజ్