Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ధోనీ క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాడా?

టీమిండియా కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పటికే టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ క్రికెట్ నుంచి పూర్తిగా ధోనీ వీడ్కోలు పలకను

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ధోనీ క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాడా?
, మంగళవారం, 14 మార్చి 2017 (15:12 IST)
టీమిండియా కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఇప్పటికే టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ క్రికెట్ నుంచి పూర్తిగా ధోనీ వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. ధోనీ ఇక మూడు నెలల్లో క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటిస్తారా లేదా అనేది ఇంకా మూడు నెలల్లో తేలిపోతుందని ధోనీ చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ చెప్పారు. 
 
జూన్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాతే ధోని తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవచ్చని కేశవ్‌ బెనర్జీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే ధోనీ దృష్టంతా ఆ టోర్నీపైనే ఉందని.. అందులో బాగా ఆడగలిగితే 2019 ప్రపంచ కప్ వరకు కొనసాగాలనే నిర్ణయానికి వస్తారని తాను భావిస్తున్నట్లు కేశవ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. 2014 చివర్లో అనూహ్యంగా టెస్టులకు గుడ్‌బై చెప్పిన ధోని, అదేరీతిలో ఈ ఏడాది జనవరిలో వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తనను వేలెత్తి చూపకుండా ఉండేందుకే అప్పుడు అనూహ్యంగా టెస్టుల నుంచి తప్పుకున్నాడని వివరించారు. కానీ ఐపీఎల్ పదో సీజన్లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్టు కెప్టెన్‌గా ధోనీని తప్పించిన తీరు తనను బాధించిందని బెనర్జీ తెలిపాడు. 
 
అండర్-14 క్రికెట్ టోర్నీ సందర్భంగా కేశవ్‌ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ధోనీ వయస్సు పెరిగింది కాబట్టి మెరుగైన ఆటతీరును కనబరచడం సహజమని... ఇతరులు వేలెత్తి చూపకముందే తన గురించి నిర్ణయం తీసుకోగలడని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిచెల్ మార్ష్ అవుట్- ఆపరేషన్ అనివార్యమైతే.. పూణే సూపర్ జెయింట్స్‌కు షాక్..