Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ సలహాలు విలువైనవి.. మా జట్టులో కీలక ఆటగాడు అతడే: కోహ్లీ

భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మెట్ల సారథ్యబాధ్యతల నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనీపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ప్రస్తుతం భారత జట్టులో మాజీ కెప్టెన్‌ ధోని భారత క్రికెట్‌ జట్టుల

ధోనీ సలహాలు విలువైనవి.. మా జట్టులో కీలక ఆటగాడు అతడే: కోహ్లీ
, శనివారం, 14 జనవరి 2017 (16:02 IST)
భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మెట్ల సారథ్యబాధ్యతల నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనీపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ప్రస్తుతం భారత జట్టులో మాజీ కెప్టెన్‌ ధోని భారత క్రికెట్‌ జట్టులో విలువైన పాత్ర పోషిస్తాడని అభిప్రాయపడ్డాడు.
 
ఇంగ్లండ్ - భారత్‌ల మధ్య ఆదివారం నుంచి స్వదేశంలో వన్డే సిరీస్ ఆరంభంకానుంది. దీన్ని పరస్కరించుకుని కోహ్లీ శనివారం మీడియాతో మాట్లాడుతూ... ధోనీ జట్టుకు చాలా విలువైన ఆటగాడని.. అతని సలహాలు తమకు ఎంతో ఉపయోగపడతాయన్నాడు. ఆయన సూచనలను గౌరవిస్తూ తన పంథాని కొనసాగిస్తానని చెప్పాడు. 
 
జట్టులో వారి బాధ్యతలపైన స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లనున్నామన్నాడు. డీఆర్‌ఎస్‌ విషయంలో పూర్తిగా ధోనిపైనే ఆధారపడతానని తెలిపాడు. ధోని డీఆర్‌ఎస్‌ అప్పీల్‌ విషయంలో తిరుగులేదని, 95 శాతం ధోని నిర్ణయం ఎప్పుడూ తప్పు కాలేదని తెలిపాడు. ధోనికి క్రికెట్‌పై ఉన్న పరిజ్ఞానం యువ ఆటగాళ్లకు ఎంతో మేలు చేస్తుందని కోహ్లీ అన్నాడు. 
 
ఇకపోతే.. ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌కు మొదటిసారి వన్డేలకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండటం పట్ల ఆనందంగా ఉందన్నాడు. ప్రస్తుతం ఉన్న జట్టులోని ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారని చెప్పాడు. అందరూ ఊహించిన జట్టుతోనే బరిలోకి దిగుతామని, తుది జట్టు విషయంలో మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయమని కోహ్లీ తెలిపాడు. టెస్టు సిరీస్ ఓడినంత మాత్రాన ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయమన్నాడు.
 
మరోవైపు ఇంగ్లండ్ మాత్రం టెస్టు సిరీస్ ఓటమిని మరిచిపోయేలా వన్డే సిరీస్‌లో విజయం సాధించాలని ఉవ్విళూరుతోంది. రూట్, బట్లర్, బెయిర్‌స్టో, హేల్స్, రాయ్, మోర్గాన్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ భీకరంగా ఉంది. అలీ, వోక్స్ వంటి ఆల్‌రౌండర్లు ఆ జట్టుకు బలం. అయితే రెండు వార్మప్ మ్యాచ్‌లలో కెప్టెన్ మోర్గాన్ విఫలమవడం కొంత ప్రతికూలాంశంగా చెప్పవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అజారుద్దీన్‌కు షాక్.. మలుపులు తిరుగుతున్న హెచ్‌సీఏ రాజకీయం