Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌కు తిరుగులేని ఆస్తి ధోనీ : కోచ్ రవిశాస్త్రి

భారత్‌కు తిరుగులేని ఆస్తి కీపర్ ధోనీ అంటూ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. '2019 ప్రపంచకప్ ప్రణాళికల్లో ధోని ఉన్నాడా?' అనే ప్రశ్నకు రవిశాస్త్రి పై విధంగా సమాధానమిచ్చాడు.

Advertiesment
భారత్‌కు తిరుగులేని ఆస్తి ధోనీ : కోచ్ రవిశాస్త్రి
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (10:32 IST)
భారత్‌కు తిరుగులేని ఆస్తి కీపర్ ధోనీ అంటూ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. '2019 ప్రపంచకప్ ప్రణాళికల్లో ధోని ఉన్నాడా?' అనే ప్రశ్నకు రవిశాస్త్రి పై విధంగా సమాధానమిచ్చాడు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీమిండియాకు తిరుగులేని ఆస్తి ధోనీ అని, డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని పెద్దన్న లాంటి వాడని ప్రశంసించాడు. ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్ ధోనీయే అని, అందరికంటే వేగంగా పరిగెత్తగలడన్నారు. 
 
శ్రీలంకలో ధోనీ ప్రదర్శన ట్రైలర్ మాత్రమేనని, ధోనీ అసలు ఆటను మున్ముందు చూస్తారని చెప్పిన రవిశాస్త్రి, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం ధోనీకి లాభించిందని, వన్డేలకు మరింత ఫిట్‌గా ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడిందని అన్నారు. 
 
టీమ్ ఇండియా జట్టు ఎంపికకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయని, ఆ ప్రమాణాల మేరకు జట్టు ఎంపికకు అర్హులేనని, ఆ తర్వాత జట్టు కూర్పు, ప్లేయర్స్ ఫామ్‌లో ఉండటం అనే అంశాలు పరిగణనలోకి వస్తాయని అన్నారు. యువరాజ్ గురించి సెలెక్టర్లు ఏమనుకుంటున్నారో తనకు తెలియదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో ఫోటోతో మిథాలీరాజ్... ఇంప్రూవింగ్ తప్పదన్న క్రీడాకారిణి....