Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెత్తగా ఆడాం.. అందుకే ఓడాం.. ధోనీ :: భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్

ఢిల్లీలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో తామంతా చెత్తగా ఆడటం వల్లే చిత్తుగా ఓడినట్టు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సెలవిచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 6 పరుగ

Advertiesment
MS Dhoni
, శుక్రవారం, 21 అక్టోబరు 2016 (16:39 IST)
ఢిల్లీలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో తామంతా చెత్తగా ఆడటం వల్లే చిత్తుగా ఓడినట్టు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సెలవిచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 6 పరుగుల తేడాతో ఓడిపోగా, 5 వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది. 
 
ఈ మ్యాచ్‌లో ఓటమిపై ధోనీ స్పందిస్తూ... ఆటగాళ్ల బ్యాటింగ్‌ తీరు ఏమాత్రం బాగోలేదన్నాడు. ఎవరు కూడా సరిగా ఆడలేదని, కనీసం ఒక్కరైనా మరో పావుగంట పాటు క్రీజ్‌లో నిలబడగలిగి ఉంటే మ్యాచ్ గెలిచుండేవాళ్లమని అన్నాడు. అయితే ఒక పక్క భాగస్వామ్యం అవసరమైనప్పుడు వికెట్లు కోల్పోవడం సరికాదన్నాడు. ఒక్క బ్యాట్స్‌మెన్ అయినా తాము సరిగా ఆడామని చెప్పగలరా అని కూడా ధోనీ ప్రశ్నించాడు.
 
ఇదిలావుండగా, భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియాతో భారత్ ఆడనున్న మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ -2017లో భాగంగా జరిగే నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరిగే తేదీలను వెల్లడించింది. అయితే ఆ మ్యాచ్‌లకు జట్టు సభ్యులను మాత్రం సెలక్షన్ కమిటీ తర్వాత తేల్చనుంది.
 
మొదటి టెస్ట్ : ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు (పూణె)
సెకండ్ టెస్ట్ : మ్యాచ్ మార్చి 4 నుంచి 8 వరకు (బెంగళూరు)
మూడో టెస్ట్ : మార్చి 16-20 వరకు (రాంచి)
నాలుగో టెస్ట్ : మ్యాచ్ మార్చి 25 నుంచి 29 వరకు (ధర్మశాల)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేషనల్ కబడ్డీ ప్లేయర్... భార్య సూసైడ్ చేసుకునేలా చిత్రహింసలు పెట్టాడు.. జైలు పాలయ్యాడు