Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంఎస్ ధోనీ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆడగలడు: మహమ్మద్ కైఫ్

క్రికెట్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌తో సహా మూడు ఫార్మాట్‌లలో ఆడగలడని చత్తీస్‌గడ్ క్రికెట్ జట్టు కె్ప్టెన్ మహమ్మద్ కైఫ్ పేర్కొన్నారు. ఆదివారం ఓటమి అంచుల్లో ఉన్న జార్కండ్ జట్టును అద్భుతమైన సెంచరీతో ఆదుకుని గెలిపించి

ఎంఎస్ ధోనీ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆడగలడు: మహమ్మద్ కైఫ్
హైదరాబాద్ , సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (02:31 IST)
క్రికెట్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటికీ టెస్ట్ క్రికెట్‌తో సహా మూడు ఫార్మాట్‌లలో ఆడగలడని చత్తీస్‌గడ్ క్రికెట్ జట్టు కె్ప్టెన్ మహమ్మద్ కైఫ్ పేర్కొన్నారు. ఆదివారం ఓటమి అంచుల్లో ఉన్న జార్కండ్ జట్టును అద్భుతమైన సెంచరీతో ఆదుకుని గెలిపించిన ధోని ప్రతిభను కైప్ ప్రశంసించాడు. 57 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డ జార్కండ్‌ జట్టును ధోనీ తుపాన్ బ్యాంటింగ్‌తో విరుచుకుపడి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
 
ఈ ఆదివారం దోనీ ఆటన గమనించాక అతడి సహజ ప్రతిభ స్థాయిని ఎవరైనా అంచనా వేయవచ్చని కైఫ్ పేర్కొన్నాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో ధోనీ ఇప్పటికీ బాగానే ఆడగలడు. బంతికి ఇప్పటికీ బలంగా మోదుతుండటం మీరు చూడవచ్చు అని చత్తీస్ గఢ్ కెప్టెన్  కైఫ్ చెప్పాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో 78 పరుగుల  తేడాతో జార్కండ్ జట్టును ధోనీ గెలిపించాడు. 
 
కెరీర్‌లో తొలి మ్యాచ్ నుంచి ధోనీ ఆటను గమనిస్తూ వస్తున్నాను. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే మీరు ఒక ధోనీలా కాలేరని క్రికెట్ ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ కైఫ్ అన్నాడు. ఆదివారం మ్యాచ్‌లో ధోనీ చేసిన సెంచరీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 17 సెంచరీలు చేశాడు. చత్తీస్ గఢ్ జట్టు పరాజయం సందర్భంగా కైఫ్ వ్యాఖ్యానిస్తూ ధోనీ లేకుంటే జార్కండ్ జట్టును 120 పరుగుల వద్దే నిరోధించేవాళ్లమని చెప్పాడు.
 
ఆస్ట్లేలియాతో తొలి టెస్టులో కోహ్లీ నాయకత్వంలోని ఇండియా జట్టు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో మహమ్మద్ కైఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత ఆటగాళ్లకు కొరకరాని కొయ్యి ఒకీఫె... ఆ ముగ్గురి సలహాలతోనే టీమిండియా నడ్డివిరిచాడు