Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

9 వేల రన్స్ క్లబ్‌లో చేరిన ఎంఎస్ ధోనీ... సచిన్ టెండూల్కర్ రికార్డు బద్ధలు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసిన మూడో వికెట్‌ కీపర్‌గా, ఐదో భారత ఆటగాడిగా ధోనీ ఘనతకెక్కాడు. కివీస్‌తో

Advertiesment
MS Dhoni
, సోమవారం, 24 అక్టోబరు 2016 (11:59 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసిన మూడో వికెట్‌ కీపర్‌గా, ఐదో భారత ఆటగాడిగా ధోనీ ఘనతకెక్కాడు. కివీస్‌తో మూడో వన్డేలో మహీ ఈ మైలురాయిని చేరాడు. 
 
గతంలో శ్రీలంక కీపర్ కుమార సంగక్కర (14,234), ఆస్ట్రేలియా దిగ్గజం గిల్‌ క్రిస్ట్‌ (9,619) మహీ కంటే ముందు ఈ ఫీట్‌ చేశారు. ఇక భారత క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ (18,426), సౌరవ్‌ గంగూలీ (11,363), ద్రావిడ్‌ (10,889), అజరుద్దీన్‌ (9,378) ఈ ఘనత సాధించారు. ధోనీ కెరీర్‌లో 281 మ్యాచ్‌ల్లో 51.17 సగటు, 9 శతకాలు, 61 అర్థ సెంచరీలతో మొత్తం 9058 పరుగులు చేశాడు. 
 
మరోవైపు... వన్డేల్లో భారత తరుపు ఆడిన క్రికెటర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. అంతకుముందు వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న 195 సిక్స్‌ల రికార్డ్‌ను ఈ మ్యాచ్‌లో ధోనీ అధిగమించాడు. ప్రస్తుతం ధోనీ ఈ మ్యాచ్‌లో కొట్టిన మూడు సిక్స్‌లతో 196 సిక్స్‌లు నమోదు చేశాడు. అయితే అంతర్జాతీయంగా అందరికంటే ఎక్కువగా పాకిస్థాన్ ఆటగాడు 351 సిక్స్‌లతో టాప్‌లో ఉన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొహాలీ వన్డే : కోహ్లీ - ధోనీ వీరవిహారం.. భారత్ విజయం... సిరీస్‌లో 2-1తో ఆధిక్యం