ఒక్క రోజు సీఈవోగా ధోనీ... సూటులో అదుర్స్.. కంపెనీ ఉద్యోగులు షాక్..
టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కరోజు పాటు ఓ కంపెనీకి సీఈవోగా పనిచేశారు. ఒకే ఒక్కడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ రోజుపాటు సీఈవోగా వ్యవహరించారు. సూట్‌లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లా
టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కరోజు పాటు ఓ కంపెనీకి సీఈవోగా పనిచేశారు. ఒకే ఒక్కడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ రోజుపాటు సీఈవోగా వ్యవహరించారు. సూట్‌లో గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీకి వెళ్లాడు. సీఈవోగా కొత్త అవతారం ఎత్తాడు. సీఈవో కుర్చీలో మహేంద్ర సింగ్ ధోనీని చూసిన ఉద్యోగాలు షాక్ తిన్నారు. కమర్షియల్ ఇంటరెస్ట్స్ మేనేజర్, ధోనీ స్నేహితుడు మాట్లాడుతూ.. గతంలో ఈ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.
సీఈవోగా చేసిన ధోనీ.. కంపెనీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని తెలిపారు. ఎన్నో రోజుల కిందటే ఈ విధంగా ప్లాన్ చేశామని.. అయితే ఇప్పుడే అది సాధ్యమైందని పాండే వివరించారు. బ్యాటింగ్ సమయంలో మైదానంలో ప్రత్యర్థి బౌలర్ల బంతులను స్టాండ్స్‌లోకి పంపిస్తూ, ఫీల్డిండ్ సమయంలో కెప్టెన్ కూల్ గా ఇన్నిరోజులు సత్తా చాటిన ధోనీ.. సీఈవోగా కనిపించడంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు.