Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షమీ భార్య స్లీవ్ లెస్ డ్రెస్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ.. ముస్లింల ఫైర్..

భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సరదాగా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. అందులో హసిన్ జహాన్ స్లీవ్‌లస్ గౌను ధరించింది. ఇంకేముంది కొంతమంది

Advertiesment
Mohammed Shami
, సోమవారం, 26 డిశెంబరు 2016 (11:38 IST)
భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. తన భార్య హసిన్ జహాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సరదాగా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. అందులో హసిన్ జహాన్ స్లీవ్‌లస్ గౌను ధరించింది. ఇంకేముంది కొంతమంది నెటిజన్లు రెచ్చిపోయారు. షమీ నువ్వు అసలైన ముస్లింవేనా అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. విమర్శలు గుప్పించారు. అయితే మరికొందరు ముస్లింలు షమీకి అండగా నిలిచారు. 
 
వీరిలో సీనియర్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయని.. మొహమ్మద్ షమీకి తన మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలున్నాయని.. తాను చెప్పదలచుకున్నది అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. ట్విట్టర్, ఫేస్బుక్ పేజీలో ఫోటోలను షమీ పోస్ట్ చేసినా, రెండింట్లో విభిన్నంగా కామెంట్లు వచ్చాయి. ఫేస్ బుక్లో ఎక్కువగా దుస్తులకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తే ట్విట్టర్లో మాత్రం ఫోటోలు బాగున్నాయంటూ, ఇండియన్ ముస్లింలు మీలాగే ఉండాలని భావిస్తున్నామంటూ.. ఎక్కువగా కామెంట్లు రావడం గమనార్హం.
 
అయితేఇలాంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుపడేలా ఉన్నాయి.  మొహమ్మద్ షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. తాను చెప్పదలచుకున్నది అర్థమయ్యి ఉంటుందని భావిస్తున్నానని మొహమ్మద్ కైఫ్ తెలిపాడు. ఎవరి ఇష్టం వచ్చిన దుస్తులు వారు ధరిస్తారని మీ పని మీరు చూసుకోండంటూ దుస్తులపై కామెంట్లు చేసిన వారిపై నెటిజన్లు షమీకి బాసటగా నిలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ పోరాటం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది : మిస్బావుల్ హక్