Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహ్మద్ షమికి అర్జున అవార్డు - సాత్విక్ జోడీకి ఖేల్‌రత్న

shami
, బుధవారం, 20 డిశెంబరు 2023 (18:41 IST)
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది. భారత క్రికెటర్ మహ్మద్ షమీకి అర్జున అవార్డును ప్రకటించింది. అలాగే, స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్నను అందుకోనున్నారు. అ ర్జున అవార్డుకు 26 మంది, ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో ఐదుగురు ఎంపికయ్యారు. ఈ అవార్డులను జనవరి తొమ్మిదో తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. 
 
కాగా, అవార్డులు పొందిన వారి వివరాలను పరిశీలిస్తే, ఓజస్ ప్రవీణ్ (అర్చరీ), అదితి గోపీచంద్ స్వామి (అర్చరీ), శ్రీశంకర్ ఎం (అథ్లెటిక్స్‌), పారుల్ చౌదరి (అథ్లెటిక్స్), మహ్మద్‌ హుసాముద్దీన్‌ (బాక్సింగ్‌), ఆర్ వైశాలి (చెస్), మహ్మద్ షమి (క్రికెట్), అనూష్ అగర్వాలా (ఈక్వస్ట్రియన్‌), దివ్యకృతి సింగ్ (ఈక్వస్ట్రియన్‌ డ్రస్సెజ్‌), దీక్షా దాగర్ (గోల్ఫ్‌), క్రిషన్ బహదూర్ పాఠక్ (హకీ), సుశీల చాను (హకీ), పవన్ కుమార్ (కబడ్డీ), రితూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో ఖో), పింకి (లాన్ బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్‌), అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్ (రెజ్లింగ్), అంతిమ్ (రెజ్లింగ్), నౌరెమ్ రోషిబినా దేవి (వు షూ), శీతల్ దేవి (పారా అర్చరీ), అజయ్‌రెడ్డి (అంధుల క్రికెట్‌), ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్). 
 
ద్రోణాచార్య అవార్డులు 
రెగ్యులర్ కేటగిరీ: లలిత్ కుమార్‌ (రెజ్లింగ్), ఆర్‌.బి.రమేశ్ (చెస్), మహవీర్‌ ప్రసాద్ సైని (పారా అథ్లెటిక్స్‌), శివేంద్ర సింగ్ (హకీ), గణేష్ ప్రభాకర్ (మల్లఖాంబ్).
 
లైఫ్‌టైమ్‌ కేటగిరీ: జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్‌), భాస్కరన్ ఈ (కబడ్డీ), జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్).
 
జీవిత సాఫల్య పురస్కారం 2023: మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ కుమార్‌ శర్మ (హకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ). 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IPL 2024 వేలం.. యష్ దయాల్ హీరో అయ్యాడు.. రింకూ జీరో.. ఎలా?