Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత జట్టు ఆటతీరును ఏకిపారేసిన మైఖేల్ వాన్.. అత్యంత చెత్త జట్టు అంటూ..

Advertiesment
Michael Vaughan
, శుక్రవారం, 11 నవంబరు 2022 (12:16 IST)
భారత్ క్రికెట్ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ సారధి మైఖేల్ వాన్ ఏకిపారేశాడు. వన్డే జట్లలోనే అత్యంత చెత్త టీం భారత్ అంటూ దారుణంగా విమర్శించారు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత వారు ఏం సాధించారంటూ ఆయన ప్రశ్నించారు. పైగా, ప్రపంచ ఆటగాళ్లు అందరూ ఐపీఎల్‌లో ఆడి చూపిస్తున్నా.. తమ ఆటతీరును, ప్రదర్శనను ఏమాత్రం మెరుగుపరుచుకోలేక పోతున్నాంటూ ఘాటైన విమర్శలు చేశారు. అయితే, మైఖేల్ వాన్ చేసిన విమర్శలు ప్రతి ఒక్క భారతీయ సగటు క్రికెట్ అభిమానిని ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. 
 
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ అత్యంత చెత్త ఆటతీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనిపై మైఖేల్ వాన్ స్పందించారు.
 
"50 ఓవర్ల వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఏం సాధించింది. ఏమీ లేదు. భారత్ ఆడే వైట్ బాల్ గేమ్ (వన్డే) పాతకాలం నాటిది. వన్డే చరిత్రలో అత్యంత చెత్త పనితీరు కలిగిన జట్టు. ప్రపంచంలోని ప్రతి ఆటగాడు ఐపీఎల్‌కు వెళ్లి ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలో చూపిస్తున్నారు. కానీ, భారత్ ఇప్పటివరకు ఏం సాధించింది? అంటూ ప్రశ్నిస్తూ, టీమిండియా వైఫల్యంపై పోస్ట్ మార్టమ్ నిర్వహించినంతపని చేశాడు. 
 
అదేసమయంలో భారత జట్టులో ప్రతిభకు, నైపుణ్యానికి ఏమాత్రం కొదవలేదు. సరైన విధానమే లోపించింది. ఎవరూ కూడా భారత్‌ను విమర్శించాలని అనుకోరు. ఎందుకంటే సోషల్ మీడియాలో వారు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విశ్లేషకులు, క్రికెట్ పండితులు అయితే, నోరు మెదవు. ఎందుకంటే బీసీసీఐతో కలిసి పనిచేసే అవకాశం కోల్పోతామన్న భయం. ఈ కారణంగానే వారు నోరు విప్పేందుకు భయపడతారు. వారి బౌలింగ్ ఆప్షన్లు కొన్నే. బ్యాటింగ్ లైన్ కూడా లోతుగా ఉండదు. స్పిన్ ట్రిక్స్ కూడా లోపించాయి" అని గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ పొట్టి క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు