Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2024 : కోల్‌కతా - లక్నో జట్ల మధ్య కీలక మ్యాచ్... వేదిక ఈడెన్ గార్డెన్స్

lsg vs  kkr

వరుణ్

, ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (13:23 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఆదివారం కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా లోక్‌కతా జట్టుకు విజయం వరిస్తుందని ఆ జట్టు అభిమానులు ఎంతో అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగనుంది. హ్యాట్రిక్ విజయాలు సాధించి దూకుడు మీదున్న కోల్‌కతాకు చెన్నై అడ్డుగా నిలిచింది. ఇప్పుడు సొంత మైదానంలో లక్నోతో తలపడనుంది. 
 
బ్యాటింగ్‌ పరంగా కోల్‌కతాకు పెద్ద ఇబ్బందేం లేదు. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ శుభారంభం అందిస్తున్నారు. యువ బ్యాటర్ రఘువంశి, రింకు సింగ్, ఆండ్రి రస్సెల్ దూకుడుగా ఆడుతున్నారు. లక్నో బౌలర్లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ విషయానికొచ్చేసరికి స్టార్‌ పేసర్ మిచెల్ స్టార్క్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్‌ చక్రవర్తి, ఆండ్రి రస్సెల్ బౌలింగ్‌లో రాణించడంతో కోల్‌కతా విజయాలను నమోదు చేయగలిగింది. స్టార్క్ కూడా ఫామ్‌లోకి వస్తే కోల్‌కతాను ఆపడం ప్రత్యర్థులకు కష్టమే. 
 
లక్నోలో నిలకడగా రాణిస్తున్న వారిలో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రమే కనిపిస్తున్నాడు. స్టాయినిస్‌, పూరన్, డికాక్ అడపాదడపా ఆడి నెట్టుకొస్తున్నారు. గత మ్యాచ్‌లో వీరందరూ విఫలమైనా యువ బ్యాటర్ ఆయుష్‌ బదోని హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సీజన్‌లో లఖ్‌నవూ తొలి మ్యాచ్‌లో ఓడిన తర్వాత హ్యాట్రిక్ విజయాలతో ఆకట్టుకుంది. కానీ, దిల్లీతో మాత్రం మళ్లీ ఓటమిని చవిచూసింది. బౌలింగ్‌ పరంగా మయాంక్‌ యాదవ్ దూరం కావడం కాస్త నష్టమే. 
 
అయితే, అర్షద్ ఖాన్, నవీనుల్ హక్‌, యశ్‌ ఠాకూర్, రవి బిష్ణోయ్‌ ఫర్వాలేదనిపించారు. ఆసీస్‌పై అదరగొట్టి వార్తల్లో నిలిచిన షమార్ జోసెఫ్ ఈ మ్యాచ్‌లోనైనా బరిలోకి దిగుతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్‌ మధ్యాహ్నం జరగనున్న నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్‌లో టాస్‌ నెగ్గే జట్టు బ్యాటింగ్‌ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. మంచు ప్రభావం ఉండదు. ఇరు టీమ్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు తలపడగా.. లఖ్‌నవూనే విజయం సాధించడం విశేషం. ఆ జట్టుపై తొలి గెలుపు రుచి చూడాలనే లక్ష్యంతోనే కోల్‌కతా బరిలోకి దిగనుంది. 
 
ఇరు జట్ల తుది అంచనా..
కోల్‌కతా : సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్, రఘువంశి, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా/వెంకటేశ్‌ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రి రస్సెల్, రమణ్‌దీప్‌ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్‌ చక్రవర్తి
 
లక్నో : కేఎల్ రాహుల్ (కెప్టెన్), డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్‌, అర్షద్‌ ఖాన్, నవీనుల్ హక్ / షమార్ జోసెఫ్, యశ్‌ ఠాకూర్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2024- 160 ప్ల‌స్ టార్గెట్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో డీసీ అదుర్స్