ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ నేటి నుంచి ఓవల్ మైదానంలో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై విజయం సాధించేందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు.
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సేవలను వినియోగించుకోవాలని సచిన్ పేర్కొన్నాడు. ఓవల్ మైదానం మ్యాచ్ నడుస్తున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కనుక స్పిన్నర్లకు కొంత మొగ్గు ఉంటుందని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
భారత బౌలర్లకు ఓవల్ చక్కని వేదికగా సచిన్ అభిప్రాయపడ్డాడు. ఇకపోతే.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది.
లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్లు ట్రోపీ కోసం పోటీపడుతున్నాయి. ఐదు రోజుల ఈ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు మొత్తం 38 లక్షల అమెరికన్ డాలర్లు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కనుంది.