లోధా కమిటీ వర్సెస్ బీసీసీఐ: అకౌంట్లను స్తంభింపచేయడం దురదృష్టకరమన్న అనురాగ్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అకౌంట్లను స్తంభింప చేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పందించారు. బీసీసీఐ అకౌంట్లను స్తంభింప చేయలేదని లోధా కమిటీ అంటుంటే, తమ అకౌంట్లను లోధా కమిటీ నిలిపివ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అకౌంట్లను స్తంభింప చేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పందించారు. బీసీసీఐ అకౌంట్లను స్తంభింప చేయలేదని లోధా కమిటీ అంటుంటే, తమ అకౌంట్లను లోధా కమిటీ నిలిపివేసిందని బీసీసీఐ స్పష్టం చేసింది.
బీసీసీఐ అకౌంట్లను నిలిపివేయటం చాలా దురదృష్టకరమంటూ ఠాకూర్ పేర్కొన్నారు. తమ మొత్తం అకౌంట్లు లోధా ప్యానెల్ ఆదేశాలతో స్తంభింపబడ్డాయన్నారు. దాంతో ప్రస్తుతం టోర్నమెంట్లు నిర్వహించడానికి నిధులు లేవని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
అయితే అంతకుముందు బీసీసీఐ అకౌంట్ల నిలుపుదలపై ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని లోధా ప్యానెల్ పేర్కొంది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై ఎలాంటి అభ్యంతరం లేదని సదరు కమిటీ పేర్కొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు చాంపియన్స్ ట్రోఫీకి స్వల్ప వ్యవధి మాత్రమే ఉన్నా.. ఇది ముందస్తు షెడ్యూల్ కాబట్టి ఆ రెండు టోర్నీల్లో భారత జట్టు పాల్గొనవచ్చని తెలిపింది. ఇరువురి వాదనలు భిన్నంగా ఉండటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.