న్యూజిలాండ్‌తో సిరీస్ రద్దు చేయాల్సిన అవసరం లేదు: స్పష్టం చేసిన జస్టిస్ లోథా
న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని జస్టీస్ లోథా కమిటీ స్పష్టం చేసింది. ఇటీవల లోథా కమిటీ సూచించిన సిఫార్సులను బీసీసీఐ పాటించడంలేదంటూ బోర్డుప
న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని జస్టీస్ లోథా కమిటీ స్పష్టం చేసింది. ఇటీవల లోథా కమిటీ సూచించిన సిఫార్సులను బీసీసీఐ పాటించడంలేదంటూ బోర్డుపై సుప్రీంకోర్టు ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. దీంతో బీసీసీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూండటంతో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచులు రద్దయ్యే అవకాశం ఉందని పలువురు భావించారు.
దీనిపై మంగళవారం స్పందించిన జస్టిస్ లోథా న్యూజిలాండ్‌తో సిరీస్ రద్దు చేయాల్సిన అవసరం లేదని మీడియాకు తెలిపారు. రోజువారీ వ్యవహారాలకు నిధులు వెచ్చింకూడదని బీసీసీఐకి చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వకూడదని మాత్రమే తాము చెప్పినట్లు పేర్కొన్నారు.