మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లా విరాట్ కోహ్లీ వంద సెంచరీలు సాధించగలడా అని ప్రశ్నిస్తే.. ఆ ఆలోచనే చాలా దూరమైందని తన అభిప్రాయమని యువరాజ్ సింగ్ అన్నాడు. కోహ్లీని సచిన్‌తో పోల్చవద్దని యువీ చెప్పాడు. ఈ తరం క్రికెట్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్సుమెన్ అని చెప్పాడు. అయినప్పటికీ సచిన్ పోల్చడం సరికాదన్నాడు.
సచిన్ స్థాయికి చేరుకోవాలంటే కోహ్లీ ఇంకా చాలా కష్టపడాలని తెలిపాడు. సచిన్ స్థాయికి ఎదగాలంటే తీవ్రంగా శ్రమిస్తే సాధ్యమని వెల్లడించాడు. మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గొప్ప ఆటగాడని.. ఆయనే భారత్‌కు గొప్ప అంబాసిడర్ అని కొనియాడాడు.
కోహ్లీ విషయానికి వస్తే.. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలిపాడు. ఏదో ఓ రోజు కోహ్లీ కూడా భారత్ తరపున అత్యుత్తమ క్రికెటర్ అవుతాడని ఆశిస్తున్నట్లు యువరాజ్ చెప్పుకొచ్చాడు.