Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. శతక్కొట్టిన పుజారా-కోహ్లీ: భారీ స్కోర్ దిశగా భారత్

విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లు మెరుగ్గా ఆడుతున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ- పుజారా భాగస్వామ్యంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ముందుగా టాస్ గెలిచి బ్యా

Advertiesment
Kohli hits century; Pujara
, గురువారం, 17 నవంబరు 2016 (16:36 IST)
విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లు మెరుగ్గా ఆడుతున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ- పుజారా భాగస్వామ్యంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు గట్టి దెబ్బే తగిలింది. రాహుల్ (0), మురళీ విజయ్ (20) వికెట్లు కుప్పకూలడంతో భారత్‌కు కష్టాలు తప్పవని ఫ్యాన్స్ భావించారు. అయితే కెప్టెన్ కోహ్లీ, పుజారా ద్వయం జట్టును ఆదుకుంది. 
 
జట్టుకు భారీ స్కోరు సంపాదించే దిశగా సహకరించింది. ఈ క్రమంలో కోహ్లీ- పుజారా అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. సెంచరీలు నమోదు చేసుకున్నారు. పుజారా 204 బంతుల్లో 12 పోర్లు, 2 సిక్సర్లతో 1119 పరుగులు సాధించాడు. అయితే ఆండర్సన్ బంతికి వెనుదిరిగాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ 209 బంతుల్లో 15 ఫోర్లతో  135 పరుగులు సాధించి క్రీజులో ఉన్నాడు. కోహ్లీకి రహానే తోడయ్యాడు. దీంతో భారత్  78 ఓవర్లలో 289 పరుగులు సాధించింది. 
 
ఇకపోతే.. పుజారా అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో వరుసగా సెంచరీలు నమోదు చేశాడు. భారత జట్టుకు ఓపెనర్‌గా సరైన బ్యాట్స్‌మన్ కావాలనుకున్నప్పుడు టీమిండియాకు పూజారా కనిపించాడు. అందుకే పుజారాను కోచ్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీలు జట్టులోకి తీసుకున్నారు. ఆపై వెస్టిండీస్ టూర్‌లో దిశా నిర్దేశం చేశారు. స్ట్రైక్‌రేట్ పెంచుకోవాలని, నిలకడ సాధించాలని కోరారు. అయితే ఆ తర్వాత న్యూజిలాండ్ టూర్‌లో రాణించిన పుజారా ఇప్పుడు అదే ఫామ్‌ను ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో కూడా కొనసాగిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడువేల పరుగుల మార్కును సాధించిన పుజారా.. సచిన్, ద్రవిడ్ సరసన నిలిచిపోయాడు..