బ్రాండ్ల రారాజు కోహ్లీ.. కానీ పెప్సీ వద్దంటున్నాడు. ఇంత మార్పా?
అటు మైదానంలోనూ ఇటు ప్రకటనల రంగంలోనూ అత్యంత దూకుడు కనబరుస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంత సాధువైపోయాడేంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అవును మరి. నిజంగానే దూకుడుతనపు కోహ్లి మారిపోయాడు... ప్రస్తుతం క్రికెట్ ఫీల్ట్ లోనే ఎవరికీ సాధ్యం కాని
అటు మైదానంలోనూ ఇటు ప్రకటనల రంగంలోనూ అత్యంత దూకుడు కనబరుస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంత సాధువైపోయాడేంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అవును మరి. నిజంగానే దూకుడుతనపు కోహ్లి మారిపోయాడు... ప్రస్తుతం క్రికెట్ ఫీల్ట్ లోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా 18 ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అతను, ఇకపై తాను వాడే, తనకు నచ్చిన వాటికే అంబాసిడర్‌గా ఉంటానన్నాడు. అందులో భాగంగా పెప్సీతో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోరాదని నిర్ణయించుకున్నాడు.
గత ఆరేళ్లుగా పెప్సీ కూల్ డ్రింక్‌తో కోహ్లికి అనుబంధం ఉంది. నేరుగా పెప్సీ అని పేరు చెప్పకపోయినా, ఈ సంస్థతో కాంట్రాక్ట్ పొడిగించుకోవద్దని తీసుకున్న నిర్ణయం అతని ఆలోచనలను చూపించింది. ‘కొన్నాళ్లుగా నా ఫిట్‌నెస్‌పై బాగా దృష్టి పెట్టాను. దానికి ఇబ్బంది కలిగించే వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పేర్లు చెప్పను కానీ కొన్ని ఉత్పత్తులను నేను వాడటం లేదు. కేవలం డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి అలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ వాడమని అభిమానులకు చెప్పలేను’ అని ఇటీవల కోహ్లి వ్యాఖ్యానించాడు.
అయితే కూల్ డ్రింక్ కాకుండా పెప్సికో కంపెనీకి సంబంధించిన హెల్త్ బ్రాండ్ కోసం కోహ్లితో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇన్నాళ్లకన్నా పాటించని దానికోసం డబ్బులు తీసుకుని అభిమానులను మోసం చేయడం ఇష్టం లేక తానే మారినందుకు కోహ్లీపట్ల అభిమానుల్లో మరింత క్రేజ్ పెరిగింది.