Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరిణతి విషయంలో కోహ్లీ ఇప్పటికీ వెనుకబాటే: జడేజాపై ఆగ్రహం ఎందుకు?

ఆధునిక క్రికెట్‌లో పరిపూర్ణ బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తుండవచ్చు.. క్రికెట్ లోని మూడు ఫార్మాట్‌లోనూ విరాట్రూపం ప్రదర్శిస్తుండవచ్చు. ఫిట్‌నెస్‌కు ప్రతిరూపంగా, పరుగుల యంత్రానికి మారుపేరుగా క్రికెట్ బుక్‌లో సువర్ణాక్షరాలను

Advertiesment
Cricket
హైదరాబాద్ , సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (02:02 IST)
ఆధునిక క్రికెట్‌లో పరిపూర్ణ బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తుండవచ్చు.. క్రికెట్ లోని మూడు ఫార్మాట్‌లోనూ విరాట్రూపం ప్రదర్శిస్తుండవచ్చు. ఫిట్‌నెస్‌కు ప్రతిరూపంగా, పరుగుల యంత్రానికి మారుపేరుగా క్రికెట్ బుక్‌లో సువర్ణాక్షరాలను లిఖిస్తుండవచ్చు.. కానీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రదర్శించాల్సిన పరిణతి విషయంలో ఇంకా వెనుకబాటుతనంతో ఉన్నట్లే తెలుస్తోంది. బంగ్లాదేశ్‌ జట్టుపై ఏకైక టెస్టుమ్యాచ్ నాలుగోరోజు ఆటలో జడేజాపై నోరు పారేసుకున్న కోహ్లీ సంయమనం విషయంలో మాజీ కెప్టెన్ ధోనీ సృష్టించిన ప్రమాణాలను అందుకోవడంలో ఇంకా వెనుకబడినట్లే అనిపిస్తోంది. బౌలర్ మూడ్‌ని, నిలకడని సొంత కెప్టెనే మరిం చెడగొడితే ఫలితాలు అనూహ్యంగా మారిపోతాయన్న గుణపాఠం కెప్టెన్ కోహ్లీ ఇంకా నేర్చుకోనట్లే ఉంది.
 
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో జడేజాపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు ముష్ఫికర్ రహీమ్‌ను ఔట్ చేసే అవకాశాన్ని చేజార్చాడు జడేజా. దీంతో కోహ్లీ ఆగ్రంహంతో జడేజాపై గట్టిగా అరిచి కొన్ని మాటలను విసిరాడు. జడేజా ఏం చేశాడంటే.. షకీబుల్ హాసన్ కొట్టిన షాట్‌‌కు ముష్ఫికర్ మూడో పరుగు తీయడానికి ప్రయత్నించాడు. దాదాపుగా క్రీజ్ మధ్యలోకి వచ్చేశాడు. కానీ జడేజా బంతిని కీపర్ వైపు విసిరాడు. దీంతో ముష్ఫికర్ వెనక్కి పరుగు పెట్టి ఎటువంటి ప్రమాదం లేకుండా బౌలింగ్ ఎండ్‌‌కు చేరుకున్నాడు. 
 
ప్రత్యర్ధి జట్టును తొందరగా ఔట్ చేయాలని చూస్తున్న క్రమంలో బంగ్లా కెప్టెన్ 127 పరుగులతో ఇబ్బంది పెట్టాడు. ఇదిలా ఉంటే నాలుగో రోజు ఆటలో బంగ్లా జట్టు 103/3 వద్ద నిలిచింది. అయితే మ్యాచ్ గెలిచేందుకు కోహ్లీ సేన చివరి రోజు ఆటలో ఇంకా 7 వికెట్లు తీయాల్సి ఉంది.
 
స్కోర్ వివరాలు..
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్  687/6 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్  388/10
భారత్ సెకండ్ ఇన్నింగ్స్  159/4 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ సెకండ్ ఇన్నింగ్స్  103/3 బ్యాటింగ్ కొనసాగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసాధ్యాన్ని సాధ్యం చేసినా సరే.. బంగ్లా జట్టుకు విజయం కష్టమే!