Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను కనుక బీసీసీఐ ప్రెసిడెంటైతే.. చార్టెర్డ్ ఫ్లయిట్ సిద్ధం చేసేవాడిని?

kapil dev
, మంగళవారం, 1 ఆగస్టు 2023 (10:58 IST)
అక్టోబర్ 5న వన్డే ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. అహ్మదాబాద్‌లో తొలి మ్యాచ్ జరగబోతోంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తొలి మ్యాచ్‌ను ఆడబోతున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడుతుంది. అక్టోబర్ 8న చెన్నైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. 
 
ఈ నేపథ్యంలో బీసీసీఐని ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇండియాలో జరగబోతున్న ప్రపంచకప్‌కు బీసీసీఐ సన్నద్ధం అవుతున్న తీరును  కపిల్ దేవ్ తప్పుపట్టారు. మన జట్టు మంచిగా రాణిస్తున్నంత కాలం మిమ్మల్ని బెస్ట్ బోర్డ్ అంటారని... అందులో తప్పేమీ లేదన్నారు. అయితే, బెస్ట్ బోర్డు కూడా మరింత ఇంప్రూవ్ కావాల్సి ఉంటుందని చెప్పారు. 
 
ప్రపంచ కప్ ఫిక్స్చర్ (షెడ్యూల్) చూస్తే తనకు చాలా ఆశ్చర్యకరంగా ఉందని కపిల్ అన్నారు. మ్యాచ్‌లు ఆడటం కోసం మన ఆటగాళ్లు ధర్మశాలకు, అక్కడి నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి కోల్ కతాకు... ఇలా ఈ చివరి నుంచి, ఆ చివరకు సుదీర్ఘ ప్రయాణాలు చేసేలా షెడ్యూల్ ఉందని కపిల్ విమర్శించారు. 
 
ఈ షెడ్యూల్‌ను ఎవరు తయారు చేశారని ప్రశ్నించారు. ప్రపంచకప్‌లో ఇండియా 11 మ్యాచ్‌లను ఆడబోతోంది. కానీ వివిధ వేదికలకు ఆటగాళ్లు ప్రయాణించాల్సిన సమయం వారిని తీవ్ర అలసటకు గురి చేసేలా ఉందని వెల్లడించారు. తానే బీసీసీఐ ప్రెసిడెంట్ అయి ఉంటే మన ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెర్డ్ ఫ్లయిట్‌ను సమకూర్చేవాడినని కపిల్ దేవ్ చెప్పారు. మైదానంలో వారు పూర్తి స్థాయిలో ప్రదర్శన కనపరిచేందుకు తాను అన్నీ చేసేవాడినని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభ్‌మన్ గిల్‌ భవితవ్యంపై జోస్యం చెప్పిన భజ్జీ