సానియాకు అమ్మాయి పుడితే మిరిల్లా లేదా రీమ్ అనే పేరు పెడతా: మాలిక్

గురువారం, 16 ఏప్రియల్ 2015 (17:58 IST)
టెన్నిస్ డబుల్స్ నెంబర్ వన్ ప్లేయర్ సానియా మీర్జాకు కూతురు పుడితే.. ఆమెకు మిరిల్లా లేదా రీమ్ అనే పేరు పెడతామని ఆమె భర్త పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్  షోయబ్ మాలిక్ చెప్పాడు. సానియా నెంబర్ వన్ ర్యాంకు సందర్భంగా సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మాలిక్ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు రిమోట్ సానియా చేతిలోనే ఉంటుందని, ఆమెకు నచ్చిన ఛానెలే చూడాలని షోయబ్ చెప్పాడు. క్రికెటర్ కాకుంటే సానియాకు మేనేజర్‌ని అయ్యుండేవాడినని చమత్కరించాడు.
 
క్రికెట్ తరువాత తన తల్లి అంటే తనకు ఇష్టమని షోయబ్ నిజాయతీగా ఒప్పుకున్నాడు. భార్యాభర్తలన్నాక గొడవలు సర్వసాధారణమన్నారు. అయితే కీచులాటను సానియా ఆరంభిస్తే, ముగింపు తానిస్తానని షోయబ్ చెప్పాడు. త్వరలోనే బుల్లి మాలిక్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తామని అభిమానులకు మాటిచ్చాడు. వివాహం తరువాత సానియా మంచి ఫామ్‌లో ఉండగా, తన కెరీర్ పతనం కాలేదని అభిప్రాయపడ్డాడు. టీనేజ్‌లో ఉండగా ప్రేమలో పడ్డానని షోయబ్ అంగీకరించాడు. అయితే ఆ అమ్మాయి.. సానియా కాదని మాలిక్ వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి