Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లీ కంటే వారే బెస్ట్.. ఆఫ్‌స్టంప్‌కు అవతలగా వెళ్లే బంతుల్ని ఎదుర్కోకపోవడం మైనస్సే

టీమిండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీపై ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ షాకింగ్‌ కామెంట్లు చేశాడు. కోహ్లీ కంటే ఆస్ట్రేలియా సారథి స్మిత్, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఉత్తమ ఆటగాళ్లని బ్రాడ్ వ్యా

కోహ్లీ కంటే వారే బెస్ట్.. ఆఫ్‌స్టంప్‌కు అవతలగా వెళ్లే బంతుల్ని ఎదుర్కోకపోవడం మైనస్సే
, గురువారం, 29 డిశెంబరు 2016 (10:06 IST)
టీమిండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీపై ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ షాకింగ్‌ కామెంట్లు చేశాడు. కోహ్లీ కంటే ఆస్ట్రేలియా సారథి స్మిత్, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ ఉత్తమ ఆటగాళ్లని బ్రాడ్ వ్యాఖ్యానించాడు. ఓవైపు కోహ్లీ ప్రతిభను మెచ్చుకుంటూనే రూట్‌ గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు. ‘విరాట్‌ కంటే రూట్‌ అత్యుత్తమ ఆటగాడు. రూట్‌తో కలిసి చాలా మ్యాచ్‌లాడాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా పరుగులు చేయగలడని కొనియాడాడు. 
 
తన దృష్టిలో తాను చూసిన ఆటగాళ్లలో రూట్ గొప్ప ఆటగాడని బ్రాడ్ తెలిపాడు. స్మిత్‌ కూడా ఉత్తమ బ్యాట్స్‌మన్‌. రూట్‌, స్మిత్‌లిద్దరూ నిలకడైన ఆటగాళ్లు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా రాణించగలరని బ్రాడ్‌ అభిప్రాయపడ్డాడు. ఆఫ్‌స్టంప్‌నకు అవతలగా వెళ్లే బంతులను ఆడలేకపోవడం విరాట్‌ బలహీనత అని అతని లోపాన్ని ఎత్తిచూపాడు. ఆ వీక్‌నెస్‌ ప్రత్యర్థులకు ప్లస్‌పాయింట్‌ అని అంటున్నాడు. 
 
‘విరాట్‌ గురించి ఓ మాట చెప్పాలి. అతను అద్భుత ఆటగాడే. అంత సులువుగా బౌల్డ్ కాడు. భారత్‌తో సిరీస్‌లో అతని ప్రదర్శన చాలా బాగుంది. కానీ ఆఫ్‌స్టంప్‌కు అవతలగా వెళ్లే బంతుల్ని ఎదుర్కోలేక పోవడం మైనస్సేనని బ్రాడ్ తెలిపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్-ఇంగ్లండ్‌ల మధ్య వన్డే సిరీస్‌.. ధోనీదే భారం.. హాట్ కేకుల్లా అమ్ముడుబోయిన టిక్కెట్లు