ఐపీఎల్ సీజన్ పోటీల్లో భాగంగా, బుధవారం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు మరోమారు ఓటమిని చవిచూసింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఇదిలావుంటే, మ్యాచ్ అనంతరం వ్యాఖ్యాత డానీ మోరిసన్‌కు, సీఎస్కే జట్టు కెప్టెన్ ధోనీకి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
టాస్ ఓడిన తర్వాత ధోనీని మోరిసన్ ప్రశ్న అడగబోతుండగా, అభిమానుల నినాదాలతో స్టేడియం హోరెత్తిపోయింది. తర్వాత సీజన్‌లో ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు అని ధోనీతో మోరిసన్ అన్నాడు. దీనికి ధోనీ సమాధానమిస్తూ, వచ్చే సీజన్ సంగతి అటుంచి.. తర్వాతి మ్యాచ్‌లో ఆడుతానో లేదో నాకే తెలియట్లేదు అంటూ నవ్వేశాడు. ధోనీ చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అయింది.