ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కోసం మెగా వేలం పాటలను వచ్చే నవంబరు లేదా డిసెంబరు నెలలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను రెండు మూడు రోజుల్లో బీసీసీఐ విడుదల చేయొచ్చని తెలిపింది.
గత పదేళ్లలో రెండు పర్యాయాలు ఐపీఎల్ మెగా ఈవెంట్ పాటలను నిర్వహించారు. మొదట 2014లో, ఆ తర్వాత 2018లో ఈ పాటలను నిర్వహించింది. అపుడు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ సస్పెన్షన్ తర్వాత తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చాయి.
2025 ఐపీఎల్‌కు గాను మెగా వేలానికి సంబంధించి మరో రెండు రోజుల్లో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపారు. కరోనా కారణంగా 2021లో మెగా వేలం పాటలను నిర్వహించలేదు. త్వరలోనే జరగనున్న వేలం పాటలను రెండు రోజుల పాటు నిర్వహించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం.