Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ మ్యాచ్‌లకు సురేష్ రైనా దూరం... భార్య చెంతనే ఉండేందుకేనట..!?

Advertiesment
IPL 2016: Suresh Raina may finally miss an IPL match
, మంగళవారం, 10 మే 2016 (18:32 IST)
ట్వంటీ-20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా ఐపీఎల్ తొమ్మిదో సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. త్వరలో తండ్రి కాబోతున్నానని ప్రకటించిన సురేష్ రైనా విశ్రాంతి కోసమో గాయం కోసమో ఈ మ్యాచ్‌కు దూరం కావట్లేదు. ప్రస్తుతం తన సతీమణి ప్రియాంక చౌదరి గర్భంగా ఉండటంతో పాటు ఆమెకు డెలివరీ సమయం దగ్గర పడటంతో ఆమెకు పక్కనే ఉండాలనే ఉద్దేశంతో ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇందుకోసం సురేష్ రైనా హాలాండ్ వెళ్తున్నాడు. 
 
తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని పెళ్లాడిన సురేష్ రైనా.. ఐపీఎల్ ప్రారంభం అయిన 2008 నుంచి ఒక్క మ్యాచ్ కూడా మిస్సవకుండా వరుసగా 143 మ్యాచ్‌లాడి అరుదైన రికార్డు సృష్టించాడు. అయితే తొలిసారి భార్య కోసం ఐపీఎల్ సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే రైనా అందుబాటులో ఉండడు. 
 
కాగా ఐపీఎల్‌లో 143 మ్యాచ్‌ల్లో ఆడిన సురేష్ రైనా మొత్తం 143 మ్యాచ్‌లాడిన రైనా తన భీకర బ్యాటింగ్‌తో మొత్తం 3,985 పరుగులు చేశాడు. గత సీజన్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు రైనా చెన్నై జట్టు నిషేధానికి గురవడంతో కొత్తగా వచ్చిన గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ గుడ్‌బై.. రేసులో అనురాగ్ ఠాకూర్