క్రికెటర్లకు ఇచ్చే రూ.2కోట్లు బఠానీల కంటే తక్కువే.. విదిలిస్తున్నారా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీతాలపై టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పరిధిలో ఉన్న క్రికెటర్లకు చెల్లిస్తున్న వార్షిక వేతనాలు ఏ మాత్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీతాలపై టీమిండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు పరిధిలో ఉన్న క్రికెటర్లకు చెల్లిస్తున్న వార్షిక వేతనాలు ఏ మాత్రం సరిపోవడం లేదన్నాడు. క్రికెటర్లకు ఇచ్చే రూ.2కోట్లు బఠానీల కంటే తక్కువ అంటూ రవిశాస్త్రి ఎద్దేవా చేశాడు. భారత క్రికెటర్లకు బోర్డు ఏదో విదిలించినట్లుగా ఉందని కామెంట్ చేశాడు.
భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా క్రికెటర్లకు చాలా పెద్ద మొత్తంలో జీతాలు ఇస్తున్నారన్నాడు. గ్రేడ్ 'ఏ' ఆటగాళ్లకు రూ.2 కోట్లు కాకుండా మరింత ఎక్కువగా ఇవ్వాల్సిన అవసపముందని రవిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా గ్రేడ్-ఎ ఆటగాళ్లకు రూ. 2కోట్లు, గ్రేడ్- బి ప్లేయర్లకు రూ.కోటి, గ్రేడ్ సీ వారికి రూ. 50వేల మొత్తాన్ని వార్షిక వేతనంగా చెల్లిస్తోంది.