అమెరికా గడ్డపై భారత్ - విండీస్ తొలి ట్వంటీ-20.. ఒక్క పరుగు తేడాతో ఓటమి
అమెరికా గడ్డపై తొలి ట్వంటీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ భారత్ - వెస్టిండీస్ జట్లు కలిసి ఆడాయి. ఈ మ్యాచ్ టీ-20 ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. సిక్సర్లు, బౌండ్రీలతో లాడర్‌హిల్ స్టేడియం హోరెత్తిపోయిం
అమెరికా గడ్డపై తొలి ట్వంటీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ భారత్ - వెస్టిండీస్ జట్లు కలిసి ఆడాయి. ఈ మ్యాచ్ టీ-20 ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. సిక్సర్లు, బౌండ్రీలతో లాడర్‌హిల్ స్టేడియం హోరెత్తిపోయింది. నికార్సయిన బ్యాటింగ్ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ పరుగుల సునామీ సృష్టించారు. బ్యాటింగ్ జోరుతో 489 పరుగులు నమోదయ్యాయి.
కానీ, టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓడటం అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపర్చింది. కేఎల్ రాహుల్ శతకంతో చెలరేగినా ఫలితం దక్కలేదు. ఆఖరి బంతికి 2 రన్స్ చేయాల్సిన దశలో కెప్టెన్ ధోనీ అవుట్ కావడంతో భారత మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా ధోనీ సేన ఒక్క పరుగుతో భారత్ ఓడిపోయింది.
భారత్‌తో రెండు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో వెస్టిండీస్ బోణీ చేసింది. శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఒక్క పరుగు తేడాతో టీమిండియాపై గెలిచి.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఎవిన్ లెవిస్ (49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 100) శతకం, జాన్సన్ చార్లెస్ (33 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 79) అర్థ సెంచరీతో రాణించడంతో.. విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. బుమ్రా, జడేజా రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన భారత 4 వికెట్లు కోల్పోయి 244 పరుగులే చేయగలిగింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 110 నాటౌట్) సెంచరీ వృథా అయింది. రోహిత్ శర్మ (62) అర్థ సెంచరీ చేయగా, రహానే (7), విరాట్ (16) చొప్పున పరుగులు చేశాడు. ఒక దశలో 51 పరుగులకే 2 కీలక వికెట్లను భారత్ కోల్పోయింది. ఈ దశలో రోహిత, రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దినా ఫలితం లేకుండా పోయింది.