Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విండీస్‌పై గెలుపు: అనిల్ కుంబ్లేపై ప్రశంసల జల్లు.. అనిల్ భాయ్ అంటూ మిశ్రా కితాబు!

వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే భారత్ 1-0తో ఆధిక్యం సాధించిన సంగతి నేపథ్యంలో.. భార‌త్ స్పిన్న‌ర్ అమిత్ మిశ్రా, కోచ్ అనిల్ కుంబ్లేని ప‌నితీరును కొనియాడారు. విండీస్‌తో రెండో

Advertiesment
India vs West Indies
, శుక్రవారం, 29 జులై 2016 (15:09 IST)
వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే భారత్ 1-0తో ఆధిక్యం సాధించిన సంగతి నేపథ్యంలో.. భార‌త్ స్పిన్న‌ర్ అమిత్ మిశ్రా, కోచ్ అనిల్ కుంబ్లేని ప‌నితీరును కొనియాడారు. విండీస్‌తో రెండో టెస్టు శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మిశ్రా మాట్లాడుతూ అనిల్‌ భాయ్‌ లాంటి మేధావితో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నాడు. 
 
తొలి టెస్టులో వికెట్‌ స్లో అయినప్పుడు శైలిని మార్చమని కుంబ్లేనే తనకు సలహా ఇచ్చాడని అని మిశ్రా వివరించాడు. టెస్టుల్లో టెయిలెండర్స్‌ ఎక్కువ సేపు ఎలా బ్యాటింగ్‌ చేయాలో.. అది జట్టుకు ఎంత అవసరమో కుంబ్లే తన అనుభవాలను జోడించి తమకు వివరించాడు. 
 
భారత జట్టుకు హెడ్ కోచ్‌గా కుంబ్లే రాకతో మొదటి మ్యాచ్‌లోనే టీం ఇండియా కేక ప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు ఇదే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. కుంబ్లే తనదైన స్టైల్లో చక్కని బాధ్యత నిర్వహించి అపూర్వ విజయాన్ని అందించాడని పలువురు అభిమానులు అభినందిస్తున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 
 
మరోరోజు మిగిలుండగానే ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి దుమ్ములేపింది. కోచ్‌గా కుంబ్లే వచ్చాక జరిగిన తొలి మ్యాచ్‌లోనే రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకోవడం శుభపరిణామం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హర్భజన్ సింగ్ తండ్రయ్యాడు.. గీతా బాస్రాకు పండంటి ఆడబిడ్డ.. భజ్జీ స్పందన ఏది?