ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: పాక్ ఓపెనర్లు అర్థసెంచరీలతో అదరగొట్టారు.. పాక్ స్కోర్ 116
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, పాక్ బ్యాటింగ్‌కి దిగింది. పాక్ ఓపెనర్లు అజహర్ అలీ, అజహర్ అలీ బరిలోకి దిగారు. భారత బౌలర్ భువనేశ్వర్ వేసిన మొదటి బంతిని అజహర్ అల
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, పాక్ బ్యాటింగ్‌కి దిగింది. పాక్ ఓపెనర్లు అజహర్ అలీ, అజహర్ అలీ బరిలోకి దిగారు. భారత బౌలర్ భువనేశ్వర్ వేసిన మొదటి బంతిని అజహర్ అలీ కొట్టడంతో ఈ పోరు మొదలైంది. పది ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ జట్టు స్కోరు 56 పరుగులు సాధించింది. పాక్ ఓపెనర్లు అజహల్ అలీ, ఫకర్ జమాన్‌ల అద్భుత భాగస్వామ్యం కొనసాగుతోంది.
ఓపెనర్లు భారత బౌలర్ల ధాటికి మెరుగ్గా ఆడటంతో అర్థ సెంచరీలను నమోదు చేసుకున్నారు. 18.4 ఓవర్లలో 102 పరుగులు సాధించి పాక్ ఓపెనర్లు.. అజహర్ అలీ, ఫకర్ జమాన్ సునాయాసంగా అర్థ సెంచరీలను తమ ఖాతాలో వేసుకున్నారు.
అజహర్ అలీ 61 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు సాధించగా, ఫకర్ 60 బంతుల్లో, ఏడు ఫోర్లతో 42 పరుగులు సాధించాడు. ఫలితంగా 20.3 ఓవర్లలో పాకిస్థాన్ 116 పరుగులు సాధించింది. ప్రస్తుతం అలీ (51), ఫకర్ (52)లతో క్రీజులో ఉన్నారు.