Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కివీస్‌తో తొలి టెస్టు మ్యాచ్.. 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు..500వ టెస్టులో కివీస్ జోరు..

న్యూజిలాండ్‌లో ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 291 పరుగులు సాధించింది. చారిత్రక 500వ టెస్టులో తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగ

Advertiesment
India vs NZ first Test: Kiwi fightback leaves hosts at 291/9 on Day 1
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (18:21 IST)
న్యూజిలాండ్‌లో ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి 291 పరుగులు సాధించింది. చారిత్రక 500వ టెస్టులో తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగింది. ప్రారంభంలో భారత్ ఆధిపత్యం చెలాయించినా.. కివీస్ బౌలర్ల ధాటిగా భారత్ చతికిల పడింది. 
 
మురళీ విజయ్, చటేశ్వర పూజారా అర్థ సెంచరీలతో రాణించారు. కోహ్లీ, రహానే విఫలమైనా రోహిత్‌, అశ్విన్‌ అదుకున్నారు. ఈ టెస్టులో చివరి మూడు రోజులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కాబట్టి రెండో రోజు శుక్రవారం ఆటలో పైచేయి సాధించడం ఇరు జట్లకు ప్రధానంగా మారింది. భారత ఆటగాళ్లలో మురళీ విజయ్ (65), చటేశ్వర పుజారా (62) అర్థ సెంచరీలు సాధించారు.
 
వీరి ధాటితో లంచ్‌ సమయానికి వికెట్‌ నష్టానికి 105 పరుగులతో పటిష్టంగా ఉన్న టీమిండియా తరువాత తడబడింది. లంచ్‌ తరువాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (9), అజింక్యా రహానే (18), రోహిత్‌ (35), రవీంద్ర జడేజ (16), ఉన్మక్త్‌ యాదవ్‌ (8) నాటౌట్‌గా ఉన్నారు.
 
అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ ప‌ట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ రెండ‌వ రోజు టీ విరామ స‌మ‌యానికి న్యూజిలాండ్ వికెట్ న‌ష్టానికి 152 ర‌న్స్ చేసింది. కేన్ విలియ‌మ్‌స‌న్‌, టామ్ లాథ‌మ్‌లు భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. విలియ‌మ్‌స‌న్ 65, లాథ‌మ్ 56 ర‌న్స్‌తో క్రీజ్‌లోనే ఉన్నారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఇప్ప‌టికే 117 ప‌రుగుల భాగస్వామ్యం ఏర్ప‌డింది. తొలి రోజు పిచ్ స్పిన్‌కు స‌హ‌క‌రించినా, ఇవాళ మాత్రం భార‌త స్పిన్న‌ర్లు పెద్ద ప్ర‌భావం చూప‌లేక‌పోయారు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 318 ర‌న్స్‌కే ఆలౌటైన విష‌యం తెలిసిందే. వర్షం వల్ల మూడవ సెషన్ ప్రస్తుతానికి ఆగిపోయింది. గ్రౌండ్ మొత్తం కవర్స్ వేశారు. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయ్యే సూచనలున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధం.. కానీ ప్రేమించిన క్రికెటర్నే పెళ్లాడిన నర్జిస్