Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాన్పూర్ టెస్ట్ : 377/5 వద్ద డిక్లేర్ చేసిన ఇండియా.. కివీస్ లక్ష్యం 433

కాన్పూర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 500 టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 377/5 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ అధిక్యం 56 పరుగులు కలుపుకుని 433 పరుగుల భారీ లక్

Advertiesment
India vs New Zealand
, ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (16:56 IST)
కాన్పూర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 500 టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 377/5 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ అధిక్యం 56 పరుగులు కలుపుకుని 433 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచింది. 159/1 ఓవర్ నైట్ స్కోర్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ సేన నిలకడగా ఆడింది. 
 
ఆదివారం ఆటలో మురళీ విజయ్(76) వికెట్ కోల్పోయిన భారత్, ఆ తర్వాత విరాట్ కోహ్లీ (18) వికెట్‌ను నష్టపోయింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో చటేశ్వర పుజారా (78) అవుట్ కావడంతో భారత్ కొంచెం తడబడినట్లు కనిపించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 318 ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 262 పరుగులకే కుప్పకూలింది.
 
కాగా, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లోనూ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే అవుట్ అయిన కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 40 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసిన కోహ్లీ, క్రెయిగ్ బౌలింగ్‌లో సోధీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ దారి పట్టాడు. 
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన కివీస్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. దీంతో రేపు చివరి రోజు కావడంతో భారత్ గెలవడానికి ఇంకా ఆరు వికెట్లు పడగొట్టాల్సి ఉంది. అయితే న్యూజిలాండ్ జట్టు భారత్ కన్నా ఇంకా 341 పరుగులు వెనకబడి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్రాత్మక టెస్టులో చెలరేగిన భారత స్పిన్నర్ జడేజా... కుప్పకూలిన కివీస్‌