Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రెస్ట్‌చర్చ్‌ థర్డ్ వన్డేలో కుప్పకూలిన భారత్ బ్యాటింగ్

washington sundar
, బుధవారం, 30 నవంబరు 2022 (11:37 IST)
క్రెస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ కుప్పకూలిపోయింది. కేవలం 219 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్ల దెబ్బకు భారత ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఫలితంగా మూడే వన్డేలో అతి తక్కువ స్కోరుకే అన్ని వికెట్లను సమర్పించుకున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు శిఖర్ ధవాన్ 28, శుభమన్ గిల్ 13లు మరోమారు నిరాశపరిచారు. నిజానికి ధావన్ మంచి ఆరంభం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది సఫలం కాలేదు. ఈ క్రమంలో మూడో నంబరుగా బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 49 పరుగులు చేసి సత్తా చాటాడు. 
 
అయితే, రిషబ్ పంత్ 10, ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ 6తో పాటు దీపక్ హుడా కూడా పూర్తిగా నిరాశపరిచారు. దీంతో 170 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్.. 47.3 ఓవర్లలో 219 పరుగులకు అన్ని వికెట్లను కోల్పోయింది. 
 
ఒక దశలో భారత్ స్కోరు 200 పరుగులు కూడా దాటని భావించగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 65 బంతుల్లో ఐదు ఫోర్లు, ఓ సిక్సర్ సాయతంతో 51 పరుగులు, అర్ష్ దీప్ 9తో కలిసి 200 పరుగులను దాటించాడు. ఆ తర్వాత మిగిలిన అటగాళ్లు చేతులెత్తేయడంతో 219 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో మిల్నే, మిచెల్‌లు మూడేసి వికెట్లుతీయగా, టీమ్ సౌథీ రెండు వికెట్లు తీసి భారత్ నడ్డి విరిచారు.
 
టాస్ ఓడిన భారత్.. 
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, బుధవారం చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్ జట్టుతో తలపడుతుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 
 
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, అక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్లు తేడాతో గెలుపొందగా, హామిల్టన్ వేదికగా జరగాల్సిన రెండు వన్డే వర్షం కారణంగా రద్దు చేశారు. దీంతో బుధవారం జరిగే థర్డ్ వన్డే మ్యాచ్ ‌ఇరు జట్లకు త్యంత కీలకంకానుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను 2-0 తేడాతో చేజిక్కుంచుకోవాలని ఆతిథ్య కివీస్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. కానీ, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు.
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ జట్టులో మాత్రం బ్రాస్‌వెల్ స్థానంలో మిల్నే జట్టులోకి దిగుతున్నారు. కాగా, వన్డే సిరీస్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌న భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రెస్ట్‌చర్చ్‌లో థర్డ్ వన్డే మ్యాచ్ : భారత్ బ్యాటింగ్