Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కపిల్ దేవ్ తర్వాత రెండో భారత బౌలర్‌గా ఇషాంత్ శర్మ!

కపిల్ దేవ్ తర్వాత రెండో భారత బౌలర్‌గా ఇషాంత్ శర్మ!
, ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (15:21 IST)
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో వంద టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత బౌలర్‌గా హర్యానా హరికేన్ కపిల్‌దేవ్‌కు రికార్డు ఉంది. ఇపుడు మరో బౌలర్ ఆ ఖ్యాతిని గడించనున్నారు. ఆ బౌలర్ పేరు ఇషాంత్ శర్మ. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇషాంత్ శర్మ తన వందో టెస్ట్ మ్యాచ్‌లు స్వదేశంలోనే ఆడనున్నాడు. 
 
ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌లు చెన్నైలో జరిగాయి. మూడో టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో జరుగనుంది. ఇదే స్టేడియంలో కొత్త రికార్డు నెలకొల్పేందుకు ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ ఎదురుచూస్తున్నాడు. 
 
అంత సవ్యంగా సాగితే.. వందో టెస్ట్‌ ఆడుతున్న రెండో టీమిండియా బౌలర్‌గా ప్రపంచవ్యాప్తంగా 11వ క్రికెటర్‌గా ఇషాంత్‌శర్మ చరిత్రకెక్కనున్నారు. భారత్‌ తరఫున ఈ ఫీట్‌ను అందుకున్న ఏకైక బౌలర్‌ కపిల్‌దేవ్‌. 
 
2007లో టెస్ట్‌ క్రికెట్‌లో చోటు సంపాదించుకున్న ఇశాంత్ శర్మ.. తన కెరీర్‌లో అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు భారత గడ్డపైనే ఆడటం విశేషం. భారతదేశంలో 39 టెస్టులు ఆడగా.. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధికంగా 13 టెస్టులు ఆడాడు. ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు 12 టెస్టుల్లో మాత్రమే బౌలింగ్‌ చేశాడు. టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని 99 మ్యాచుల్లో సాధించాడు. 
 
అయితే, వేగంగా 300 వికెట్లు సాధించిన రికార్డు మరో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్నది. అశ్విన్ కేవలం 54 టెస్టుల్లో 300 వికెట్లు తీసుకున్నాడు. ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియాపై అత్యధికంగా 25 టెస్టులు ఆడాడు. అతను ఇంగ్లండ్‌తో కేవలం 19 మ్యాచ్‌లు ఆడాడు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లతో ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్‌ ఆడాడు. 
 
వికెట్ల విషయానికొస్తే, ఇంగ్లండ్‌పై అత్యధికంగా 61 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాపై 59 వికెట్లు పడగొట్టాడు. ఒక ఏడాదిలో ఎక్కువ వికెట్ల పరంగా 2011, 2018లో అతడికి ఉత్తమమైనవిగా చెప్పుకోవచ్చు. 2011 లో 12 టెస్టుల్లో 43 వికెట్లు, 2018 లో 11 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు పడగొట్టాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ-20 ప్రపంచ కప్‌.. వీసాపై పాకిస్థాన్ వార్నింగ్.. లేకుంటే అలా చేస్తుందట!?