స్వదేశంలో జరిగిన చెన్నై - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు కైవసం చేసుకున్నారు. బుధవారం చెన్నై వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించి 21 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 269 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఆ తర్వాత 270 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 248 పరుగులకే ఆలౌట్ అయింది. ఓ దశలో హార్దిక్ పాండ్యా 40 పరుగులతో మెరుపులు మెరిపించి, భారత శిబిరంలో ఆశలు రేకెత్తించారు. కానీ, ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అద్భతంగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదు. జంపా 10 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఆస్టన్ అగర్ 2, స్టాయినిస్ 1, షాన్ అబ్బాట్ 1 చొప్పున వికెట్ తీశాడు.
భారత ఇన్నింగ్స్‌లో కోహ్లీ అత్యధికంగా 54 పరుగులు చేయగా, ఓపెనర్ శుభమన్ గిల్ 37, కెప్టెన్ రోహిత్ శర్మ 30, కేఎల్ రాహుల్ 32 చొప్పున పరుగులు చేశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది.