ఆసీస్‌తో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆసీస్ ఆటగాళ్లలో మాథ్యూ షార్ట్, కూపర్ కొన్నోలీ చక్కటి అర్ధ సెంచరీలు సాధించారు. భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ 97 బంతుల్లో 73 ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఫలితంగా భారత్ తొమ్మిది వికెట్లకు 264 పరుగులు చేసింది.
శ్రేయాస్ అయ్యర్ 61 పరుగులు చేయగా, ఆడమ్ జంపా 60 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. జేవియర్ బార్ట్‌లెట్ 39 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అయితే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (4/60) నాలుగు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్ (3/36) మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసి గెలుపొందింది. మాథ్యూ షార్ట్(78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74), కూపర్ కన్నోల్లీ(51 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కోవడంతో పాటు తొలి సిరీస్‌ను కోల్పోయాడు.