కోహ్లీ మ్యాచ్ గెలిచాక షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.. అహం ఎక్కువ.. సారీ చెప్పాలి: ఆసీస్ మీడియా
భారత్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టు ఓడిపోవడంపై ఆ దేశ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. గతంలో కోహ్లీని ఏకిపారేసినట్లే.. మళ్లీ కోహ్లీపై ఆసీస్ మీడియా అక్కసును వెళ్లగక్కింది. కోహ్లీకి అహంకారం ఎక్కువని.. అందుకే దిగ
భారత్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టు ఓడిపోవడంపై ఆ దేశ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. గతంలో కోహ్లీని ఏకిపారేసినట్లే.. మళ్లీ కోహ్లీపై ఆసీస్ మీడియా అక్కసును వెళ్లగక్కింది. కోహ్లీకి అహంకారం ఎక్కువని.. అందుకే దిగజారి ప్రవర్తించడంతో పాటు చిన్నపిల్లాడి వ్యవహరిస్తున్నాడని ఆసీస్ మీడియా ఘాటుగా విమర్శలు గుప్పించింది.
బీర్ పార్టీకి రావాలని కెప్టెన్ స్మిత్.. తాత్కాలిక కెప్టెన్ రహానేను కోరగా అందుకు రహానే అంగీకరించకపోవడాన్ని కూడా ఆస్ట్రేలియా మీడియా తప్పుపట్టింది. ఇక ధర్మశాల క్రికెట్ మ్యాచ్ పూర్తయిన వెంటనే కోహ్లీ మీడియా ముందు మాట్లాడిన వైనాన్ని ఆసీస్ మీడియా తప్పుబట్టింది. దీంతో కోహ్లీని టార్గెట్ చేస్తూ.. ఆస్ట్రేలియాకు చెందిన పలు మీడియా సంస్థలు ఫైర్ అయ్యాయి.
టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలిచిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఇకపై స్నేహితులుగా పరిగణించలేనని కామెంట్స్ చేశాడు. అంతేగాకుండా విజయానికి అనంతరం.. కోహ్లీ షేక్ హ్యాండ్ కూడా చేయకపోవడం ఆసీస్ మీడియా మండిపడింది.
కోహ్లీకి అహం ఎక్కువని సిడ్నీ నుంచి వెలువడే డైలీ టెలిగ్రాఫ్ ఆరోపించింది. మురళీ విజయ్‌పై నోరు పారేసుకున్నందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ క్షమాపణ చెప్పాడని.. కోహ్లీ కూడా క్షమాపణ చెప్పాలని హెరాల్డ్ సన్ జర్నలిస్ట్ రసెల్ డిమాండ్ చేశారు.