Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెస్ట్ క్రికెట్ ఆటగాడికి గొప్ప సంతృప్తినిస్తుంది : రాహుల్ ద్రవిడ్

rahul dravid

ఠాగూర్

, సోమవారం, 11 మార్చి 2024 (12:09 IST)
టెస్ట్ క్రికెట్ ఆటగాడికి గొప్ప సంతృప్తినిస్తుందని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్‌ జట్టు జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. అదేసమయంలో దేశంలో టెస్ట్ ఫార్మెట్ క్రికెట్‌కు ఆదరణ పెంచే విషయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దృష్టిసారించింది. ముఖ్యంగా, టెస్టులు ఆడే క్రికెటర్లకు ఇన్సెంటివ్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఈ అంశంపై రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ క్రికెట్ ఒక్కోసారి కష్టంగా అనిపిస్తుంది కానీ ఆటగాడికి గొప్ప సంతృప్తినిస్తుందన్నాడు. 
 
ఇంగ్లండ్‌పై భారత్ 4-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను గెలిచిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో యువ క్రికెటర్లకు పలు సూచనలు ఇచ్చే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి సిరీస్‌లు గెలివాలి. కానీ చాలా సంక్లిష్టమైనది. టెస్ట్ క్రికెట్ ఆడడం కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది. నైపుణ్యాలపరంగా, శారీరకంగా, మానసికంగా కష్టంతో కూడుకున్నది. మీరంతా చూస్తూనే ఉన్నారు. కానీ సిరీస్ ముగింపులో గొప్ప సంతృప్తి కలుగుతుంది. తొలి మ్యాచ్ ఓడిపోయి ఆ తర్వాత 4 మ్యాచ్‌లను వరుసగా గెలిచిన సిరీస్‌ను కైవసం చేసుకోవడం ఎన్నటికీ గుర్తుండిపోతుంది. ఇది అసాధారణమై విజయంగా నేను భావిస్తున్నాను అని ద్రవిడ్ పేర్కొన్నాడు. 
 
ఇక ఆటగాళ్లు ఒకరికొకరు ఉపయోగపడతారని, ఇతరుల గెలుపులలో కూడా సాయపడాల్సి ఉంటుందన్నాడు. జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు ఒకరినొకరు విజయవంతం చేయాల్సి అవసరం ఉంటుందన్నాడు. బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్ అయినా ఇతరుల విజయంతో వ్యక్తిగత విజయాలు ముడిపడి ఉంటాయని తెలుసుకోవాలని యువ క్రికెటర్లకు సూచించాడు. ఒకరి విజయానికి మరొకరు సహకరిస్తూ ముందుకు వెళ్లడం చాలా ముఖ్యమని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ టెస్ట్ ర్యాంకులు : మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న భారత్