Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

1983 వరల్డ్ కప్ గెలిచిన యస్పాల్ శర్మ గుండెపోటుతో మృతి

1983 వరల్డ్ కప్ గెలిచిన యస్పాల్ శర్మ గుండెపోటుతో మృతి
, మంగళవారం, 13 జులై 2021 (12:22 IST)
Yashpal
1983లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీమ్ సభ్యుడు, మాజీ క్రికెటర్ యస్పాల్ శర్మ హఠాన్మరణం చెందారు. ఆయన గుండెపోటుతో చనిపోయారు. యస్పాల్ శర్మ వయసు 66 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం గుండెపోటు రావడంతో 7.40 గంటలకు ఆయన మరణించారు.
 
1983లో క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన టీమ్ సభ్యుడు, బ్యాట్స్ మెన్ అయిన యస్పాల్ శర్మకు భార్య రణు శర్మ, ఇద్దరు కుమార్తెలు పూజ, ప్రీతి, ఓ కుమారుడు చిరాగ్ శర్మ ఉన్నారు. పంజాబ్‌లోని లూధియానాలో యస్పాల్ శర్మ 1954 ఆగస్టు 11న జన్మించారు. 1970 దశకం చివర్లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం చేశారు. 80ల్లో కూడా ఆయన కెరీర్ కంటిన్యూ అయింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రాణించారు.
 
1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కీలక ఆటగాడు. ఆయన 89 పరుగులు టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి ఎంతో దోహదపడ్డాయి. వెస్టిండీస్‌ను మట్టి కరిపించేందుకు సాయపడ్డాయి. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో పెద్దగా ఆడలేదు. కానీ 61 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. కానీ, ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ బాబ్ విలీస్ వేసిన యార్కర్‌ను సిక్స్‌ కొట్టిన తీరు అద్భుతం. ఆ షాక్ ఒక అందమైన జ్ఞాపకంగా వర్ణిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒలింపిక్స్ క్రీడలకు చిన్నారి.. అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్