టీమిండియా కోహ్లీపై ఆధారపడలేదు.. ఆటగాళ్ల ప్రతిభను తక్కువ చేయొద్దు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆధారపడలేదని మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోపీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆయన తెలిపారు. టుస్సాడ్ మ్యూజియంలో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆధారపడలేదని మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోపీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆయన తెలిపారు. టుస్సాడ్ మ్యూజియంలో పెట్టిన ఆయన మైనపు విగ్రహాన్ని వీక్షించిన అనంతరం మీడియాతో కపిల్ మాట్లాడుతూ.. భారత జట్టు ఛాపింయన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టులో సమర్థులైన ఆటగాళ్లున్నారని చెప్పాడు.
అందుకే కోహ్లీ ఫాంపై పెద్దగా ఆందోళన లేదన్నారు. ఆస్ట్రేలియా టూరుకు ముందు టీమిండియా ఆటగాళ్లపై ఇలాంటి ఆలోచనే ఉండేదని.. అయితే ధర్మశాల టెస్టులో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సమయంలో జట్టులోని ఇతర క్రికెటర్లు జట్టు భారాన్ని తలకెత్తుకున్నారని గుర్తు చేశారు. కోహ్లీ పేరు చెప్పి ఇతర ఆటగాళ్ల ప్రతిభను తక్కువ చేయవద్దని సూచించారు.