Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోధా కమిటీ సిఫార్సులపై మొండి వైఖరి: అనురాగ్ ఠాకూర్‌ను తొలగించిన సుప్రీం

లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా.. తమ ఆదేశాలను లెక్కచేయకుండా.. మొండి వైఖరితో ముందుకెళ్తున్న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ పదవి నుంచి తప్పించింది. అతనితో పాటు బీస

Advertiesment
India news January 2
, సోమవారం, 2 జనవరి 2017 (11:52 IST)
లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా.. తమ ఆదేశాలను లెక్కచేయకుండా.. మొండి వైఖరితో ముందుకెళ్తున్న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ పదవి నుంచి తప్పించింది. అతనితో పాటు బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కేపై కూడా వేటు వేసింది. 
 
లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని తాను ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. బీసీసీఐ పట్టించుకోకపోవడంతో సుప్రీం కోర్టు కొరడా ఝుళిపించింది. తమ ఆదేశాలను పాటించకపోతే చూస్తూ ఊరుకోనని తీవ్ర హెచ్చరికలు పంపింది. త్వరలోనే ఈ పదవులను కొత్తవారితో సుప్రీంకోర్టు భర్తీ చేయనుంది.
 
కాగా.. లోధా కమిటీ ప్రతిపాదించిన కొన్ని సంస్కరణల అమలుపై బీసీసీఐ వ్యతిరేక వైఖరినే కొనసాగించింది. బీసీసీఐ అత్యున్నత పాలకవర్గాన్ని పూర్తిగా తొలగించి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లైని బోర్డు పరిశీలికుడిగా నియమించాలని లోధా కమిటీ సుప్రీం కోర్టును కోరింది. 
 
లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసేందుకు బీసీసీఐ  సుముఖంగా ఉన్నా కొన్నింటిపైనే వ్యతిరేకంగా ఉంది. అభ్యర్థుల వయోపరిమితి 70 ఏళ్లు, రెండు పదవుల మధ్య 3 ఏళ్ల విరామం , ఒక రాష్ట్రానికి ఒక ఓటు వంటి కొన్ని అంశాలను అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని బోర్డు వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే దీనిపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీ సహచరుడు సచిన్ బేబికి అన్నా చాందీనితో వివాహం.. ఎప్పుడంటే? (Video)