Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాలె చెస్ట్‌లో భారత్ ఘన విజయం...

గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిల

Advertiesment
గాలె చెస్ట్‌లో భారత్ ఘన విజయం...
, శనివారం, 29 జులై 2017 (17:31 IST)
గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. మూడు టెస్టుల సిరీస్ లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్ (190), ఛటేశ్వర్ పుజారా (153) సెంచరీలతో రాణించడానికి తోడు రహానే (57), హార్డిక్ పాండ్య (50), అశ్విన్ (47) ఆకట్టుకోవడంతో భారత్ 600 పరుగుల భారీ స్కోరు సాధించింది. 
 
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక తరంగ (64) మాధ్యూస్ (83), పెరీరా (92) పోరాడడంతో తొలి ఇన్నింగ్స్ 291 పరుగులు చేసింది. అనంతరం మరోసారి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కోహ్లీ (103) సెంచరీతో రాణించగా, అభినవ్ ముకుంద్ (81) ఆకట్టుకోవడంతో రెండో ఇన్నింగ్స్‌ను 240 పరుగుల వద్ద ముగించింది. అనంతరం 550 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను టీమిండియా బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. 
 
అశ్విన్, జడేజా ధాటికి లంకేయులు కేవలం 245 పరుగులకే రెండో ఇన్నింగ్స్ ముగించారు. కరుణ రత్నే (97) సుదీర్ఘ ఒంటరి పోరాటం చేశాడు. డిక్ వెల్లా (67), మెండిస్ (36) నుంచి చక్కని సహకారం లభించింది. పెరీరా (21) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో శ్రీలంక జట్టు 304 పరుగుల తేదాతో తొలి టెస్టులో పరాజయం పాలైంది. ఈ టెస్టులో 6 వికెట్లతో జడేజా రాణించగా, నాలుగు వికెట్లతో అశ్విన్ సత్తాచాటాడు. షమి మూడు వికెట్లు, ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు, పాండ్య ఒక వికెట్ తీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త 'తల' అయితే... భార్య 'మెడ'... వైరల్‌గా మారిన సెహ్వాగ్ ట్వీట్