Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ - కివీస్ రెండో టీ20కి పొంచివున్న వరుణ గండం!

ind vs nz
, ఆదివారం, 20 నవంబరు 2022 (11:10 IST)
భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య ట్వంటీ20 సిరీస్ జరుగుతోంది. అయితే, ప్రారంభ మ్యాచ్ వర్షార్పణమైంది. రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరుగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభంకానుంది. 
 
అయితే, ఈ మ్యాచ్ జరిగే మౌంట్ మాంగనుయ్‌లో వర్షం పడే సూచనలు ఉన్నట్టు కివీస్ వాతావరణ శాఖ అంచనా వేసింది. మౌంట్ మాంగనుయ్‌లో మ్యాచ్ సమయంలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఈ మ్యాచ్‌పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. 
 
మరోవైపు, భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య సారథ్య బాధ్యతలు పోషిస్తున్నారు. పాండ్యా కెప్టెన్సీలో పలువురు యువ క్రికెటర్లను పరీక్షించాలని భారత్ భావిస్తుంది. ఇలాంటి వారిలో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్ వంటి యంగ్ క్రికెటర్లు ఉన్నారు. కానీ, వరుణ దేవుడు మాత్రం ప్రధాన అడ్డంకిగా మారాడు.
 
ఆతిథ్య శ్రీలంక జట్టు కూడా టీ20 వరల్డ్ కప్ సెమీస్ ఓటమి మరిచి తిరిగి గాడిలో పడాలని ఆశిస్తుంది. ఈ పరిస్థితుల్లో వరుణ దేవుడు కరుణించి ఈ మ్యాచ్‌ను సాఫీగా సాగేలా సహకరిస్తాడో లేదో వేచి చూడాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి నుంచి దుబాయ్ వేదికగా ఫిఫా సాకర్ వరల్డ్ కప్