Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొహలీ టెస్టు.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల హాఫ్ సెంచరీల రికార్డ్.. మ్యాచ్‌లో పట్టు..

మొహలీలో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లీ సేన మ్యాచ్‌పై పట్టు సాధించడంతో పాటు.. అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో లో-ఆర్డర్ (ఏడుకు తర్వాతి స్థాన

మొహలీ టెస్టు.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల హాఫ్ సెంచరీల రికార్డ్.. మ్యాచ్‌లో పట్టు..
, సోమవారం, 28 నవంబరు 2016 (15:02 IST)
మొహలీలో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లీ సేన మ్యాచ్‌పై పట్టు సాధించడంతో పాటు.. అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో లో-ఆర్డర్ (ఏడుకు తర్వాతి స్థానంలో ఉన్న) బ్యాట్స్‌మెన్లు బ్యాటింగ్ చేయడంతో పాటు మూడు అర్థ సెంచరీలు నమోదు చేసుకున్న ఘనతను భారత్ తొలిసారి తన ఖాతాలో వేసుకుంది. 
 
ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రవి చంద్రన్ అశ్విన్ (72;113 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగిన రవీంద్ర జడేజా (90;170 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకం సాధించాడు. 
 
అలాగే కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న జయంత్ యాదవ్ (55;141 బంతుల్లో 4 ఫోర్లు) తొమ్మిదో స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా భారత్ తరపున ఆడుతున్న ఒకే టెస్టులో ముగ్గురు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు అర్థ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. 
 
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆలౌ రౌండర్ రవీంద్ర జడేజా(90;170 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్) తృటిలో సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో జడేజా అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసుకున్న రికార్డు ఉంది.
 
అంతకుముందు జడేజా అత్యధిక టెస్టు స్కోరు 68 కాగా, వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 87 కావడం గమనార్హం. ఇలా భారత బ్యాట్స్‌మెన్లు మెరుగ్గా రాణించడం ద్వారా భారత్‌కు 134 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఐదు వికెట్లు, రషిద్ నాలుగు వికెట్లు పడగొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనాలి బింద్రేతో డేటింగ్ అంటే చాలా ఇష్టం.. ఆమె అందం కట్టిపడేస్తుంది: సురేష్ రైనా