Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి నుంచి పొట్టి పోరు : తొలి టీ20లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఢీ

Advertiesment
నేటి నుంచి పొట్టి పోరు : తొలి టీ20లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఢీ
, శుక్రవారం, 4 డిశెంబరు 2020 (08:03 IST)
భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య తొలి ట్వంటీ20 పోరు శుక్రవారం జరుగుంది. ఈ ఇరు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఇపుడు పొట్టి పోరుకు తెరలేవనుంది. 
 
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడి మనూకా ఓవల్‌ మైదానం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. వన్డే జట్టుతో పోలిస్తే టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ సేన మంచి సమతూకంతో ఉంది. ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులోకి రావడం, రవీంద్ర జడేజా కూడా ఫామ్‌ అందుకోవడంతో భారత్‌కు ఆల్‌రౌండర్ల కొరత తీరినట్టే కనిపిస్తున్నది. దీంతో హార్దిక్‌ పాండ్య బంతి అందుకోకున్నా బౌలింగ్‌ వనరులు సరిపడా ఉన్నాయి. 
 
మరోవైపు ఐపీఎల్‌లో బీభత్సం సృష్టించిన కేఎల్‌ రాహుల్‌ తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్‌కు ధవన్‌తో కలిసి రానున్నాడు. శ్రేయస్‌ సైతం రాణిస్తే తిరుగుండదు. మూడో వన్డేలో ఆకట్టుకున్న యార్కర్‌ స్పెషలిస్ట్‌ నటరాజన్‌ టీ20 అరంగేట్రం కూడా ఈ మ్యాచ్‌తో ఖాయంగా కనిపిస్తున్నది. బుమ్రాకు నటరాజన్‌ తోడైతే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను చివరి ఓవర్లలో కట్టడి చేయొచ్చని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భావిస్తున్నాడు. అయితే, శ్రేయస్‌ సహా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లో లేకపోవడం భారత్‌ను ఆందోళనకు గురిచేసే అంశం. 
 
ఇకపోతే, ఆస్ట్రేలియా జట్టును విశ్లేషిస్తే, గాయంతో స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ దూరమవడంతో అతడి స్థానంలో కెప్టెన్‌ ఫించ్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసేదెవరనే ప్రశ్న ఆ జట్టులో నెలకొంది. ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ ఆ స్థానానికి తగ్గవాడే అయినా స్వల్ప గాయంతో అతడు ఈ మ్యాచ్‌ ఆడడం అనుమానమే. దీంతో ఓపెనింగ్‌కు వేడ్‌ను పంపాలా.. ప్రత్యామ్నాయం ఆలోచించాలా అన్న సందిగ్ధంలో ఉంది. 
 
కాగా ఐపీఎల్‌లో విఫలమైన ఫించ్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ వన్డే సిరీస్‌లో భీకర ఫామ్‌ కనబరిచారు. వీరిని కట్టడి చేసి టీ20 సిరీస్‌లో శుభారంభం చేయాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది. మరోవైపు బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండడం ఆసీస్‌కు పెద్ద బలం. 
 
మనూకా ఓవల్‌ మైదానం బ్యాటింగ్‌తో పాటు బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే అవకాశం ఉంది. ఇక్కడ జరిగిన బిగ్‌బాష్‌ మ్యాచ్‌ల్లో మంచి స్కోర్లు నమోదయ్యాయి. ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20లో పాక్‌పై ఆస్ట్రేలియా గెలిచింది. వాతావరణం పొడిగా ఉంటుంది. 
 
తుది జట్ల అంచనా... 
భారత్ ‌: ధవన్‌, రాహుల్‌, కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయస్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌, జడేజా, చాహర్‌, నటరాజన్‌, బుమ్రా, చాహల్‌/కుల్‌దీప్‌ 
 
ఆస్ట్రేలియా : ఫించ్‌(కెప్టెన్‌), మాథ్యూ వేడ్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, క్యారీ, ఆస్టన్‌ అగర్‌, అబాట్‌, ఆండ్రూ టై/స్టార్క్‌, జంపా, హేజిల్‌వుడ్‌ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సేలం చిన్నోడి క్రికెట్ కెరీర్ అద్భుతం...