Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేలానికి వెళితే అమ్ముడు పోతానా... అమ్ముడుపోతే ఎంతకి పోవచ్చు? రిషబ్ పంత్

rishabh panth

ఠాగూర్

, శనివారం, 12 అక్టోబరు 2024 (12:23 IST)
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇపుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే 2025 ఐపీఎల్ పోటీల కోసం క్రికెటర్ల ఆటగాళ్ల వేలం పాట నిర్వహించనున్నారు. ఈ వేలం పాటలకు ముందు రిషబ్ పంత్ ఈ ట్వీట్ చేశారు. వేలానికి వెళ్తే నేను అమ్ముడుపోతానా? లేదా? అమ్ముడుపోతే ఎంతకి పోవచ్చు? అంటూ అభిమానులను ప్రశ్నించాడు. ఎక్స్ వేదికగా అతడు పెట్టిన ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా ఐపీఎల్ మెగా వేలానికి హైపన్‌ను పెంచడానికి గతంలో కూడా పంత్ ఎక్స్ వేదికగా ఇదే తరహా పోస్ట్ పెట్టాడు. ఇదిలావుంచితే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రిషబ్ పంతన్‌ను జట్టులో నిలుపుదల చేసుకోవాలని భావిస్తోంది. అతడిని వదిలిపెడుతున్నట్టుగా ఇప్పటివరకు ఒక్క సంకేతం కూడా ఇవ్వలేదు. దీనికి తోడు ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తప్ప మరే ఇతర జట్టుకు పంత్ ఆడలేదు.
 
మరోవైపు ఐపీఎల్లో రిషబ్ పంత్‌తు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఇప్పటివరకు 111 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 3,284 పరుగులు బాదాడు. ఈ మెగా టోర్నీలో అతడి స్ట్రైక్ 148.93గా ఉంది. ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు అతడు నమోదు చేశాడు. ఇక గత సీజనులో రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఇక గత ఐపీఎల్ సీజనులో పంత్ అద్భుతంగా రాణించాడు. 13 మ్యాచ్‌లలో 155.40 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 446 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీతో రాఫెల్ నాదల్‌కు వున్న అనుబంధం ఏంటి?