ఒత్తిడికి భయపడ్డాం... అందుకే కప్ చేజారింది : మిథాలీ రాజ్
మహిళల ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ ఫైనల్ పోటీలో భారత్ మహిళ క్రికెట్ జట్టు తృటిలో కప్‌ను చేజార్చుకుంది. విజయం అంచులవరకు వచ్చిన భారత జట్టు కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
మహిళల ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ ఫైనల్ పోటీలో భారత్ మహిళ క్రికెట్ జట్టు తృటిలో కప్‌ను చేజార్చుకుంది. విజయం అంచులవరకు వచ్చిన భారత జట్టు కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీనిపై కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందిస్తూ... 28 పరుగుల తేడాలో చివరి 7 వికెట్లను కోల్పోయి.. చేతిలోకి వచ్చిందనుకున్న ట్రోఫీని ఇంగ్లండ్ చేతిలో పెట్టేశారు. అయినా తమ టీమ్‌ను చూసి ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.
ఇంగ్లండ్ కూడా అంత తేలిగ్గా గెలవలేదనీ, అయితే వాళ్లు ఒత్తిడిని జయించారని చెప్పుకొచ్చింది. మ్యాచ్ ఒక దశలో రెండు జట్లకు సమాన అవకాశాలు కల్పించింది. కానీ మేం భయపడ్డాం. అదే మా ఓటమికి దారి తీసింది అని మిథాలీ అభిప్రాయపడింది. మా జట్టు సభ్యులను చూస్తే గర్వంగా ఉంది.
ప్రత్యర్థులకు ఒక్క మ్యాచ్ కూడా సునాయాసంగా ఇవ్వలేదు. ఈ టోర్నీలో బాగా ఆడాము. టీమ్‌లోని యంగ్‌స్టర్స్ అద్భుతంగా రాణించారు అని మిథాలీ చెప్పింది. ఇక తన భవిష్యత్తుపై స్పందిస్తూ.. మరో రెండేళ్లు టీమ్‌లోనే ఉంటానని, అయితే వచ్చే వరల్డ్‌కప్ మాత్రం ఆడనని ఆమె తేల్చి చెప్పింది.