Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శిఖర్ ధావన్‌కు అరుదైన గౌరవం - చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్‌గా...

Advertiesment
Shikhar Dhawan

ఠాగూర్

, గురువారం, 13 ఫిబ్రవరి 2025 (12:12 IST)
Shikhar Dhawan
భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌కి అరుదైన గుర్తింపు లభించింది. ఈ నెల 19వ తేదీ నుంచి పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీ కోసం ఐసీసీ నలుగురు అంబాసిడర్లను ఎంపిక చేసింది. వీరిలో శిఖర్ ధావన్‌తో పాటు సర్ఫరాజ్ అహ్మద్, షేన్ వాట్సన్, టీమ్ సౌథీలు ఉన్నారు. ఈ మేరకు ఈ నలుగురు అంబాసిడర్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. 
 
2013లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో గబ్బర్ (ధావన్) కీలక పాత్రను పోషించాడు. ఈ ఎడిషన్‌లో అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డును దక్కించుకున్నాడు. అలాగే, చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా గబ్బర్ పేరుమీదే ఉంది. అటు టోర్నీ చరిత్రలో వరుసగా రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ అవార్డును అందుకున్న ఏకైక క్రికెటర్‌గా శిఖర్ ధావన్ కావడం గమనార్హం. 
 
అందుకే గబ్బర్‌కు ఈ అరుదైన గౌవరం దక్కింది. దీనిపై గబ్బర్ స్పందిస్తూ, చాంపియన్స్ ట్రోఫీలో భాగం కావడం చాలా ప్రత్యేక అనుభూతి. ఈ రాబోయే ఎడిషన్‌ను అంబాసిడర్‌గా ఆస్వాదించే అవకాశం లభించడం గౌరవప్రదమైన విషయం. ఇది అభిరుచి, గర్వం, దృఢ సంకల్పం నుంచి పుట్టిన టోర్నమెంట్, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇది చాలా ఉత్కంఠభరితమైన భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జెంటిల్‌‌మెన్ గేమ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల అనుచిత ప్రవర్తన.. చివరకు ఫైనల్‌కు చేరారు... (Video)