పాకిస్థాన్ పేసర్ల నుంచి భారత్ బ్యాట్స్‌మెన్‌కు వచ్చిన ముప్పేమీ లేదు: గంభీర్
చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్‌లు ఫైనల్ మ్యాచ్ లో ఆదివారం తలపడనున్నాయి. ప్రస్తుత ఫామ్ పరంగా టీమ్ ఇండియా పాక్ కన్నా బలంగా ఉంది. భారత జట్టులో కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్‌లో కీలకం క
చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్థాన్‌లు ఫైనల్ మ్యాచ్ లో ఆదివారం తలపడనున్నాయి. ప్రస్తుత ఫామ్ పరంగా టీమ్ ఇండియా పాక్ కన్నా బలంగా ఉంది. భారత జట్టులో కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్‌లో కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పాక్ పేసర్ల నుంచి టీమిండియా బ్యాట్స్‌మన్‌కు వచ్చిన ముప్పేమీ లేదని భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.
పాక్ పేసర్లు మహ్మద్ ఆమిర్, జునైద్ ఖాన్, హసన్ అలీ ఇతర జట్లపై రాణించినా టీమిండియాపై తేలిపోక తప్పదన్నాడు. గతంలో అక్తర్, ఉమర్ గుల్ వంటి బౌలర్ల నుంచి పోటీ ఉండేదని గంభీర్ తెలిపాడు. వారిలాంటి అంత నాణ్యమైన బౌలర్లు పాక్ జట్టులో ఇప్పుడు లేరని చెప్పాడు.
ఎన్నో ఏళ్లుగా భారత్-పాక్ పోరంటే భారత బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్‌కు మధ్యే పోటీ అన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నాడు. బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు ఉమేష్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని గంభీర్ సూచించాడు.