కోహ్లీని చూస్తుంటే.. మారడోనానే గుర్తుకు వస్తున్నాడు: గంగూలీ

శుక్రవారం, 14 ఆగస్టు 2015 (10:42 IST)
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ కోహ్లీని చూస్తుంటే.. తనకు ఫుట్ బాల్ దిగ్గజం డీగ మారడోనానే గుర్తుకు వస్తున్నాడని గంగూలీ వ్యాఖ్యానించాడు.

ఇంకా గంగూలీ మాట్లాడుతూ.. ‘‘నా అభిమాన ఆటగాళ్లలో మారడోనా ఒకడు. అతడు ఫుట్ బాల్‌ను ఆరాధిస్తాడు. ఎప్పుడు చూసినా సాకర్‌తో మమేకమై ఉంటాడు. కోహ్లీలో కూడా అలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. అతడి బాడీ లాంగ్వేజ్ నాకిష్టం. కోహ్లీకి నేనే పెద్ద అభిమానిని’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
 
టెస్టు క్రికెట్‌కు ధోనీ ఉన్నట్టుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్టు బాధ్యతలు చేపట్టిన కోహ్లీ సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం శ్రీలంక టెస్టు సిరీస్‌ను గెలుచుకోవాలనే ఆకలిమీదున్న కోహ్లీ తప్పకుండా అనుకున్నది సాధిస్తాడని కొనియాడాడు. గాలె టెస్టులో కెప్టెన్‌ హోదాలోనే సెంచరీ సాధించి జట్టును భారీ స్కోరు దిశగా కోహ్లీ నడిపించాడని గంగూలీ ప్రశంసించాడు.

వెబ్దునియా పై చదవండి