భారత క్రికెట్ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ మొత్తం వర్ణ వివక్షకు గురైనట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శరీర రంగు గురించి పలు సందర్భాల్లో, పలు వేదికలపై విమర్శలు ఎదుర్కొన్నట్టు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి.
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో జాతి వివక్ష వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఇలాంటి తరుణంలో శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇపుడు శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తన కెరీర్ మొత్తం వివక్షకు గురైనట్టు ప్రకటించారు.
కాగా, గతంలో తమిళనాడుకు చెందిన అభినందన్ ముకుంద్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 15 యేళ్ల వయసు నుంచే విదేశాలకు వెళ్తున్నానని, తన రంగు గురించి కొందరు మాట్లాడుకోవడం, వ్యాఖ్యలు చేయడం ఏంటో తనకు అర్థమయ్యేది కాదని అన్నాడు.
నిజానికి క్రికెట్ గురించి తెలిసిన వారికి క్రికెటర్ల రంగుపై పూర్తి అవగాహన ఉంటుందన్నారు. ఎందుకంటే, మండుటెండల్లో సాధన చేస్తాం, క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతుంటామని దీంతో శరీర రంగుల్లో మార్పులు చోటు చేసుకుంటాయని ముకుంద్ చెప్పుకొచ్చారు. ఇపుడు తమిళనాడుకే చెందిన శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు ప్రకపంనలు సృష్టించనున్నాయి.